ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా.. జిల్లాకు 3 కేంద్రాల చొప్పున..! - Corona vaccine dry run across the country

దేశవ్యాప్తంగా నేడు కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ జరగనుంది. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​లో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటలకు కొవిడ్‌ టీకా డ్రై రన్‌ ప్రారంభంకానుంది. ఒక్కో జిల్లాలో మూడు చోట్ల కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. ఆ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 39 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నారు.

dry run
ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా.. జిల్లాకు 3 కేంద్రాల చొప్పున..!
author img

By

Published : Jan 2, 2021, 7:34 AM IST

కరోనా టీకా పంపిణీలో భాగంగా కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు దేశ వ్యాప్తంగా శనివారం డ్రై రన్‌ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్​లోని 13 జిల్లాల్లో మూడు చొప్పున ఎంపిక చేసిన 39 కేంద్రాల్లో ఈ డ్రై రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిసారి ‘సాఫ్ట్‌వేర్‌’ ఆధారంగా ఎంపిక చేసిన వారికి మాత్రమే విడతల వారీగా కరోనా టీకా ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తలకు కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా లింకుకు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా సంక్షిప్త సమాచారం వారికి అందుతుంది. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తల ఫోన్లకు శుక్రవారం రాత్రికే తెలుగులో సంక్షిప్త సందేశం వచ్చింది.

ఎప్పుడు, ఎక్కడికి రావాలనే సమాచారం అందులో ఉంటుంది. మిగిలిన జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో మరోసారి డ్రై రన్‌ చేస్తారని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రంలో తప్పనిసరిగా ఒక కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిని ఎంపికచేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాల్లో ‘జిల్లా టాస్క్‌ ఫోర్సు’ సమావేశాలు జరిగాయి. వ్యాక్సినేషన్‌ ఆఫీసర్లుగా వ్యవహరించే వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా జరిగాయి.

ప్రజారోగ్య సిబ్బందికి టీకా కోసం ఏర్పాట్లు

పుర, నగరపాలక సంస్థల్లోని ప్రజారోగ్య విభాగంలో సేవలు అందిస్తున్న సిబ్బందికి కొవిడ్‌ టీకా ఇచ్చేందుకు వారి పూర్తి వివరాలు సిద్ధం చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆ రాష్ట్ర పురపాలకశాఖను ఆదేశించింది. ‘కొవిన్‌’ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ఈనెల 4లోగా అప్‌లోడ్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర పట్టణ వ్యవహారాలశాఖ అదనపు కార్యదర్శి, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ డైరెక్టర్‌ అన్ని రాష్ట్రాల పురపాలకశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజారోగ్య విభాగంలో సేవలు అందిస్తున్న సిబ్బందికి టీకాఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.