పోలీస్ అధికారులు, సిబ్బందికి టీకాలు ఇప్పించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర రాజధానిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో 97 శాతం మందికి ఇప్పటికే టీకాలు వేయించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 94.6 శాతం మంది, సైబరాబాద్ కమిషనరేట్‌లో 97.8, రాచకొండ కమిషనరేట్‌లో 98.3 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 6,800 మంది పోలీసుల కుటుంబ సభ్యులకూ తొలి డోసు ఇప్పించారు. టీకాలతో ఫలితమూ కనిపిస్తోంది. తొలి దశలో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 83 మంది పోలీసులు మృతిచెందగా.. రెండో దశలో ఇప్పటివరకు మరణాలు 9కే పరిమితమయ్యాయి.
ఇదీ చూడండి: నడుస్తున్న రైలులో యువతి హత్య