ETV Bharat / state

కరోనా నమూనాల సేకరణ కేంద్రాలు మూణ్నాళ్ల ముచ్చటేనా? - హైదరాబాద్​లో కరోనా పరీక్ష కేంద్రాలు

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లుగా హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల పరిస్థితి ఉంది. వైరస్‌ నిర్ధారణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకు రాజధాని పరిధిలో ఏర్పాటు చేసిన నమూనాల సేకరణ కేంద్రాలు మూణ్నాళ్లకే మూతపడ్డాయి. సాంకేతిక కారణాలతో 4 రోజులు మూసి వేస్తున్నామని తిరిగి తెరుస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే వారం అవుతున్నా ఈ కేంద్రాలను తెరవలేదు.

test
test
author img

By

Published : Jul 1, 2020, 8:58 AM IST

రాష్ట్ర రాజధానిలో కొవిడ్‌ నిరోధానికి 50 వేల పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 15 చోట్ల నమూనాలను సేకరించే కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇలా ఏర్పడిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్లతోపాటు వివిధ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకున్న వారిలో చాలామందికి పాజిటివ్‌గా తేలింది. దీనివల్ల కరోనా బాధితుల నివాస ప్రాంతాల్లో వైరస్‌ విస్తరణ జరగకుండా నిరోధించడానికి అవకాశం ఏర్పడింది. జియాగూడ, వనస్థలిపురం తదితర ప్రాంతాలు ఇలా చేయడం వల్లే చాలావరకు రోగుల సంఖ్య తగ్గింది.

సాంకేతిక కారణాలతో ఈ కేంద్రాలను 4 రోజులు మూసి వేస్తున్నామని తిరిగి తెరుస్తామని ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ వారం అవుతున్నా ఈ కేంద్రాలను తిరిగి తెరవలేదు. దీంతో కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నవారు పరీక్షలు చేయించుకోవాలంటే అష్టకష్టాలు పడుతున్నారు.

  • నగరంలో నాంపల్లి, మలక్‌పేట, గోల్కొండ ఏరియా ఆస్పత్రి, జియాగూడ, అంబర్‌పేట పాఠశాలలో 2వేల నమూనాలు సేకరించారు.
  • మేడ్చల్‌ జిల్లాలో మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రి, రామంతాపూర్‌ హోమియోపతి ఆస్పత్రి, కూకట్‌పల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలోనూ సేకరించారు. కూకట్‌పల్లిలో భారీగా పరీక్షలు చేయించుకున్నారు.
  • రంగారెడ్డి జిల్లాలో కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రి, సరూర్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రితోపాటు బుద్వేల్‌లో నమూనాలు సేకరిస్తామని ప్రకటించారు కానీ అలా చేయలేదు. కొండాపూర్‌లో తక్కువ సేకరించారు. సరూర్‌నగర్‌లో నిలిపివేశారు.

సిఫార్సు ఉంటేనే పరీక్ష

గాంధీ, నేచర్‌క్యూర్‌, యునానీ, ఆయుర్వేద ఆస్పత్రితోపాటు ఐపీఎం, సీసీఎంబీ, నిమ్స్‌లో పరీక్ష చేయించుకోవాలంటే పూర్తిస్థాయిలో కరోనా లక్షణాలైనా ఉండాలి.. లేదా వైద్యుడి సిఫార్సు అయినా ఉండాలన్న నిబంధన పెట్టారు. దీనివల్ల ఆ ఆస్పత్రుల్లో పరీక్ష చేయించుకోవడం గగనంగా ఉంది. కొన్ని ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో రూ.3 వేల - రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.