ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి... త్రిపురాంతకం హైస్కూల్‍లో ఉపాధ్యాయుడికి, పీసీపల్లి హైస్కూల్‍లో విద్యార్థి, ఉపాధ్యాయుడికి కరోనా వచ్చినట్లు నిర్ధరణ అయ్యింది. పెద్దగొల్లపల్లి హైస్కూల్‍లో మరో ఉపాధ్యాయుడికి వైరస్ సోకింది. ఒక్కసారిగా కేసులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రారంభంలో కూడా జిల్లాలోని రెండు పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయలు, విద్యార్థులకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది. వీరంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. విద్యాసంస్థలు ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
చిత్తూరు జిల్లాలో 63 మంది టీచర్లకు కరోనా
చిత్తూరు జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. 63 మంది ఉపాధ్యాయులకు కొవిడ్ నిర్ధరణ అయింది. పుంగనూరు మండలంలో 13 మంది, శ్రీకాళహస్తిలో ఏడుగురికి, బీఎన్‌కండ్రిగ, పాకాల మండలాల్లో ఆరుగురికి, చిత్తూరులో ఎనిమిది మందికి, కార్వేటినగరం, నిమ్మనపల్లె, రామసముద్రం, చౌడేపల్లె మండలాల్లో ఒక్కొక్కరికి చొప్పున కరోనా సోకింది. మదనపల్లె, రేణిగుంట, వరదయ్యపాళెం, వాల్మీకిపురం, గంగవరంలో ఇద్దరు చొప్పున... నారాయణవనం, నిండ్ర, గుర్రంకొండ మండలంలో ముగ్గురు చొప్పున వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చదవండి: పాఠశాలలు తెరిచారు- చిన్నారుల్లో కరోనా ప్రబలింది!