ETV Bharat / state

ఆర్టీసి సిబ్బందికి కరోనా సెకండ్‌ వేవ్‌ ముప్పు - టీఎస్​ ఆర్టీసీ తాజా వార్తలు

కరోనా రెండోదశ శరవేగంగా విస్తరిస్తోంది. పొరుగున మహారాష్ట్ర, కర్ణాటకల్లో వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. ఆయా రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కొందరు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం శాపంగా మారిందని గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికే రెండోదశలో 550 మంది ఆర్టీసీ సిబ్బందికి వైరస్‌ సోకగా... మరింత వ్యాపించే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.

Corona second wave threat  to tsrtc
ఆర్టీసి సిబ్బందికి కరోనా సెకండ్‌ వేవ్‌ ముప్పు
author img

By

Published : Apr 26, 2021, 10:02 PM IST

ఆర్టీసి సిబ్బందికి కరోనా సెకండ్‌ వేవ్‌ ముప్పు

కరోనా రెండోదశ ఉద్ధృతి ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గతంలో 35 లక్షల కిలోమీటర్ల వరకు ఆర్టీసీ బస్సులు తిప్పగా.. ప్రస్తుతం 30 లక్షల కిలోమీటర్లకే పరిమితం చేశారు. దీనికితోడు కర్ఫ్యూ విధించడం వల్ల రాత్రి తొమ్మిది గంటల్లోపే బస్సులు డిపోలకు చేరుకుంటున్నాయి. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు కొవిడ్‌ బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా తొలిదశలో తార్నాక ఆసుపత్రి లెక్కల ప్రకారం వైరస్‌ సోకి చికిత్స పొందిన కార్మికులు, ఉద్యోగులు సుమారు 12 వందల మంది వరకు ఉన్నారు. ఈసారి రెండో దశ ఉద్ధృతిలో జనవరి నుంచి ఏప్రిల్ 26 వరకు 550 మంది సిబ్బందికి కరోనా సోకగా... వారికి చికిత్స అందించారు. ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు మరో 300 మంది సిబ్బంది వరకు ఉంటారని అధికారులు తెలిపారు

క్లిష్ట పరిస్థితుల్లోనూ...

పొరుగున మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ఆర్టీసీ సిబ్బందిని బెంబేలెత్తిస్తోంది. కష్టనష్టాల కోర్చి ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో క్లిష్ట పరిస్థితుల్లోనూ... మహారాష్ట్ర, కర్ణాటకకు సర్వీసులు నడుపుతున్నామని అధికారులు వెల్లడించారు. వాహనాలు నిత్యం శానిటైజేషన్ చేస్తున్నా.. కొందరు ప్రయాణికుల తీరు ఆందోళన కలిగిస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచినా.. ప్రయాణికులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

స్వీయ జాగ్రత్తలు

కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రయాణీకులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించే సిబ్బందికి సహకరించి అండగా నిలవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బెల్టు షాపులపై చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.