కొవిడ్‌ను నియంత్రించడానికి ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని.. భౌతిక దూరం వంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఎంత చెబుతున్నా ప్రజలు ఏమాత్రం పాటించడం లేదు. రాత్రి కర్ఫ్యూ కోసం కఠిన నియమాలను రూపొందించి అమలు చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు కొన్నిచోట్ల పట్టించుకోవడం లేదు.
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లోని వైన్స్, హలీం షాపుల ముందు ప్రజలు భౌతిక దూరం మరిచారు. ఒకరిపై ఒకరు పడుతూ వాటిని కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారు. మందుబాబులు కరోనా నియమాలను పాటించకుండా మందు బాటిల్ల కోసం పరితపించారు. కర్ఫ్యూ నియమాలను వ్యాపారులూ పాటించడం లేదు.
పోలీసులు ఎప్పటికప్పుడు జరిమానాలు విధించినప్పటికీ తమకు పట్టనట్లుగా వైన్స్, హలీం దుకాణాలు, హోటల్ యజమానులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ముషీరాబాద్ రాంనగర్ తదితర ప్రాంతాల్లోని కొన్ని హోటల్ యజమానులు రోడ్లపైనే హలీం వ్యాపారం చేయడం వల్ల ట్రాఫిక్ ఏర్పడుతోంది.
ఇదీ చూడండి: 'రాజకీయ నేతగా రాలేదు... ఈటలకు ధైర్యం చెప్పేందుకు వచ్చా'