ఏపీలో ఇవాళ మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. వీటితో కలిపి రాష్ట్రంలో మెుత్తం కేసుల సంఖ్య 432కి చేరింది. గుంటూరు జిల్లాలో 8 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. చిత్తూరు జిల్లా-2, పశ్చిమ గోదావరి-1, కృష్ణా జిల్లాలో మరో కేసు నమోదైంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రులో 413 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి : రూ. 1500కే కరోనా పరీక్ష.. రెండున్నర గంటల్లో ఫలితం