* ఓ వయోధికురాలు కొవిడ్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఇక్కడకు రాగా.. ఆమెకు పాజిటివ్‌గా తేలింది. అప్పటికే ఆమె నీరసంతో ఆయాసపడుతూ.. నిల్చునే స్థితిలో కూడా లేదు. ‘మా అమ్మ చావుబతుకుల మధ్య ఉంది.. దయచేసి కాపాడండి’ అని కుటుంబసభ్యులు వైద్యుల ముందు వాపోయారు.
‘తామున్నదే వైద్యం చేయడానికి కదా.. పడకలుంటే చేర్చుకుంటాం.. కానీ, లేకుంటే మేము కూడా చేసేదేమీ లేదు’ అని తమ నిస్సహాయతను చాటారు. దాంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రి ప్రాంగణంలోని చెట్టు కింద పడుకోబెట్టి పడక కోసం ఆశతో ఎదురుచూస్తూ.. ఉండిపోయారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు కోఠి ఆస్పత్రి వద్ద చాలా కనిపిస్తున్నాయి. చాలా మంది పేదలు కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. అక్కడ పడకలు దొరక్కపోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఎదురుచూస్తూ.. నిమిషానికోసారి వైద్యులు, వైద్య సిబ్బంది, అటెండర్లను సంప్రదిస్తూ.. పడకలపై ఆరా తీస్తున్నారు. కింగ్‌కోఠి ఆసుపత్రిలో మొత్తంగా ఉన్న 350 పడకలూ నిండిపోయాయి.
ఇదీ చూడండి: ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభించాలని సీఎస్ ఆదేశం