ETV Bharat / state

వైరల్: కన్నీరు తెప్పిస్తున్న కరోనా బాధితుడి చివరి వీడియో! - ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి న్యూస్

కరోనాతో హైదరాబాద్​ ఎర్రగడ్డ చెస్ట్​ ఆసుపత్రిలో చేరాడు ఓ బాధితుడు. పరిస్థితి విషమించడం వల్ల వెంటిలేటర్​ ఏర్పాటు చేయాల్సిందిగా సిబ్బందిని కోరాడు. ప్రయోజనం లేకపోవడం వల్ల తుదిశ్వాస విడిచాడు. బాధితుడు చివరి క్షణంలో వీడియోలో రికార్డ్ చేసిన మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

Corona patient last words on his treatment
'ఊపిరాడుతలేదు డాడీ.. అందరికీ బాయ్'
author img

By

Published : Jun 28, 2020, 8:26 PM IST

'ఊపిరాడుతలేదు డాడీ.. అందరికీ బాయ్'

వెంటిలేటర్ తీసేశారు ఊపిరాడటంలేదన్నా కూడా పెట్టడం లేదు... నేను చనిపోతున్న బాయ్ డాడీ అంటూ ఓ వ్యక్తి తుది శ్వాస విడిచే ముందు తీసుకున్న వీడియోలో పలికిన చివరి మాటలివి. మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్​ కార్పొరేషన్​ పరిధిలోని బీజేఆర్ నగర్​కి చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్​ ఎర్రగడ్డలోని చెస్ట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడం వల్ల తనకు వెంటిలేటర్​ మీద చికిత్స అందించాలని ప్రాధేయపడినా లాభం లేకపోయింది. ఆసుపత్రి యాజమాన్యం నిర్వాకం వల్ల ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శుక్రవారం తెల్లవారుజామున బాధితుడి మృతదేహాన్ని హుటాహుటిన ఆసుపత్రి యాజమాన్యం చేతులు దులుపుకుందని కుటుంబ సభ్యులు వాపోయారు.

" ఊపిరాడుతలేదని చెప్తే కూడా వినకుండా వెంటిలేటర్ బంజేసిర్రు. ఇప్పటికి మూడు గంటలైంది డాడీ. నాకు ఊపిరాడుత లేదు. గుండె ఆగిపోయింది... ఊపిరొక్కటే కొట్టుకుంటుంది. బాయ్ డాడీ బాయ్. అందరికీ బాయ్ డాడీ."

--- బాధితుడి చివరి మాటలు

ఇవీ చూడండి: కరోనాపై ఆందోళన అవసరం లేదు.. అన్నీ సిద్ధంగా ఉన్నాయి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.