ETV Bharat / state

కరోనా అప్​డేట్స్: రాష్ట్రంలో కోవిడ్​పై ఇవాళ ఏం జరిగిందంటే?

రాష్ట్రంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఈటీవీ భారత్​ కరోనాపై ఇచ్చిన ప్రధాన కథనాలు మీకోసం...

corona-news-in-telangana
కరోనా అప్​డేట్స్: రాష్ట్రంలో కోవిడ్​పై ఇవాళ ఏం జరిగిందంటే?
author img

By

Published : Jun 9, 2020, 9:33 PM IST

  • తెలంగాణపై నజర్​

కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని కేంద్రవైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. 15 రాష్ట్రాలకు బృందాలను పంపనుంది. ఆయా రాష్ట్రాల్లోని 50కి పైగా జిల్లాలు, మున్సిపాలిటీలకు కేంద్ర బృందాలు రానున్నాయి. తెలంగాణకు 4 బృందాలు పంపుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో ఒక్కో బృందం ఏర్పాటు చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

  • కరిగిపోయిన కొలువులు

కొవిడ్‌-19 ప్రభావం విద్యా ఉపాధి రంగాలను బాగా దెబ్బతీసింది. కరిగిపోయిన కొలువులు ఒక పక్క.. ఊగిసలాడుతున్న ఉద్యోగాలు మరోపక్క. అస్పష్టమైన భవిష్యత్‌చిత్రం ఉద్యోగార్థులనూ, విద్యార్థులనూ భయపెడుతోంది. ఇది దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందిస్తోంది. తాజా గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. తమ ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

  • మరి పేదల పరిస్థితి ఏంటి?

కరోనాతో జర్నలిస్టు మృతిచెందడం బాధాకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నివారణలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు. వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా ఎఫెక్ట్​

ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటుపై అడుగులు ముందుకు పడట్లేదు. గతేడాదే ప్రారంభం కావాల్సి ఉన్నా... అది జరగలేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా... ఈసారి తరగతుల నిర్వహణపై సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వరంగల్ పట్టణ జిల్లాలోనూ సైనిక్ స్కూల్ ఏర్పాటుకు మోక్షం కలగడంలేదు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా పరీక్షలు అశాస్త్రీయం

చనిపోయినవారికి కొవిడ్‌ పరీక్షలు చేయాలని హైకోర్టు వాదన అశాస్త్రీయమైందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​లో కూడా చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయాలని లేదని వెల్లడించారు.రాష్ట్రంలో నిత్యం 1000 మంది చనిపోతారని... వారికి కరోనా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడిన వారే.. కరోనా బారిన పడి చనిపోతున్నారని చెప్పారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

  • హైకోర్టు చెప్పినా వినరా..?

‍కరోనాను అరికట్టేందుకు హైకోర్టు చేసిన సూచనలను ప్రభుత్వం అమలుచేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సమస్యలను ప్రభుత్వాధినేతలను వివరించే అవకాశం లేనందున కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. కొవిడ్ విషయంలో ఇప్పటి వరకు న్యాయస్థానం చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్న కోదండరాం... ప్రజారోగ్యానికి తెలంగాణలో అతితక్కువగా ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల్లో కొవిడ్ పరీక్షా కేంద్రాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

  • మంత్రి సిబ్బందిలో ఒకరికి పాజిటివ్​

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా జిల్లాకు చెందిన మంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. వనపర్తి, మహబూబ్​నగర్​ జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహబూబ్​నగర్​లో నివాసముంటూ మంత్రి ఎస్కార్ట్​ వాహనంలో సదరు వ్యక్తి విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంగా ఉందని రిలీవయ్యారు. పరీక్షలు నిర్వహించగా.. అతనికి కరోనా ఉన్నట్లు తేలింది. ఆయనకు సన్నిహితంగా ఉంటూ విధుల్లో ఉన్నవారిని ప్రస్తుతం హోం క్వారంటైన్​కు తరలించే పనిలో పడ్డారు అధికారులు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.