ETV Bharat / state

CORONA: కుటుంబాల్ని కాటేసిన కరోనా.. అనాథలైన చిన్నారులు - అనాథలుగా మారిన పిల్లలు

పిల్లలకు రెక్కలు వచ్చేవరకు తల్లిదండ్రులిచ్చే భరోసా ఎనలేనిది. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత పిల్లల్లో ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోగలమన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. చిన్నప్పటి నుంచీ అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులు.. పిల్లల బాధ్యతలేవీ తీరకుండానే కన్నుమూస్తే, ఆ బిడ్డలకు ఆసరా ఎలా? పిన్న వయసులోనే అమ్మానాన్నలు దూరమైతే ఆ పిల్లల మానసికవ్యధ తీర్చేదెవరు? అవసరాలు తీర్చేదెవరు? కరోనా రెండోదశ సృష్టించిన విలయమిది. రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో 150 మందికి పైగా పిల్లలు అనాథలైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంచి భవిష్యత్తు, సంతోషకరమైన జీవితంపై ఆ కుటుంబాలు కన్న కలలు కల్లలయ్యాయి. పిల్లల ఆశల పునాదులన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. ఇలా అనాథలైన పిల్లల పరిస్థితిపై ప్రత్యేక కథనం.

corona
కుటుంబాల్ని కాటేసిన కరోనా
author img

By

Published : Jun 9, 2021, 6:52 AM IST

ఆ బాలుడి భవిత అగమ్యం

.

సంగారెడ్డికి చెందిన తలారి రాణి, నిఖిల్‌కుమార్‌లకు 16 ఏళ్ల క్రితం పెళ్లయింది. విద్యుత్తు శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే నిఖిల్‌ భార్య రాణి తీవ్ర అనారోగ్యం పాలవగా, ఆమెను బతికించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండేళ్ల క్రితం ఆమె కన్నుమూశారు. వారి కుమారుడు అనిల్‌కుమార్‌ (14) ఏడో తరగతి పూర్తి చేశాడు. జోగిపేట ప్రభుత్వ వసతిగృహంలో ఉండి చదువుకునేవాడు. భార్య మరణించాక, అమ్మానాన్నా తానే అయి కుమారుడిని పెంచుతున్న నిఖిల్‌ కూడా ఈ ఏడాది మే నెలలో కొవిడ్‌ బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండేళ్ల వ్యవధిలోనే తల్లితండ్రులిద్దరినీ కోల్పోయి అనాథగా మిగిలిన అనిల్‌ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

వారం రోజుల్లో విషాదం

.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన సాంబమూర్తి(48), మహిమలత (40) హైదరాబాద్‌లోని కాప్రాసర్కిల్‌ బృందావన్‌ కాలనీలో నివసించేవారు. సాంబమూర్తి ప్రైవేటు ఉద్యోగి. మహిమలత గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు సుస్మిత, హర్షిత. సుస్మిత డిగ్రీ పూర్తిచేయగా, హర్షిత ఇంటర్‌ చదువుతోంది. ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్న ఈ కుటుంబంపై కరోనా విషం చిమ్మింది. దంపతులను కబళించింది. మే 27న సాంబమూర్తి, జూన్‌ 2న మహిమలత మరణించారు. స్థోమతకు మించి ఖర్చు చేసినా ఇద్దరినీ దక్కించుకోలేకపోయామని వారి పిల్లలు వాపోతున్నారు.

తాత, నానమ్మలే దిక్కు

సిద్దిపేట గ్రామీణ బక్రిచెప్యాల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, అనూరాధలది పేద కుటుంబం. వారికి ముగ్గురు సంతానం. ఆటో నడిపి కుటుంబాన్ని నెట్టుకొచ్చిన శ్రీనివాస్‌ పదేళ్ల కిందట అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అనూరాధ కుటుంబ పోషణ కోసం సిద్దిపేటకు వచ్చి దర్జీ పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తోంది. ఇటీవల ఆమె కరోనాతో మరణించడంతో ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు. పెద్దకూతురు శ్రావణి(19), సంధ్య (18) డిగ్రీ చదువుతుండగా, చిన్న కుమారుడు సాయితేజ (16) ఇంటర్‌ విద్యను అభ్యసిస్తున్నాడు. తల్లి చనిపోవడంతో వీరు స్వగ్రామంలో ఉంటున్న నానమ్మ, తాతల వద్దకు చేరుకున్నారు. వయోధికులు, నిరుపేదలైన వారు పిల్లల బాధ్యతలు ఎలా నిర్వహించాలా అని మధనపడుతున్నారు.

కల తీరకుండానే కడతేరారు

.

నాలుగు రోజుల వ్యవధిలో అమ్మానాన్నలిద్దరినీ కోల్పోయిన ఆ యువకుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎలకతుర్తి మండలం దామెర గ్రామానికి హింగె రాజేశ్వర్‌రావు (67), రాణి(52) దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు రుత్విక్‌(16). రుత్విక్‌ను చక్కగా చదివించాలన్న ఉద్దేశంతో మంచి కళాశాలలో చేర్పించాలనుకున్నారు. ఇంతలోనే దంపతులిద్దరికీ కరోనా సోకింది. వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ, మే 5న తల్లి, 11న తండ్రి చనిపోవడంతో రుత్విక్‌ ఒంటరిగా మిగిలాడు. ప్రస్తుతం ఆ బాలుడు ఐనవోలు మండలం వెంకటాపూర్‌లోని అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. ఆసరా లేని ఈ స్థితిలో చదువు కొనసాగించడమెలాగో తెలియక అయోమయంలో ఉన్నాడు.

పిల్లల భవిష్యత్తు ఆగం

.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లికి చెందిన చినర్సని యాదయ్య, లక్ష్మిలది నిరుపేద కుటుంబం. వీరికి అయిదుగురు సంతానం. కుమారుడు సతీష్‌కు 19 ఏళ్లు. మిగతా నలుగురు ఆడపిల్లలు. రెండేళ్ల క్రితం యాదయ్య అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి తల్లి కూలి పనులు చేసి, కుటుంబాన్ని నెట్టుకువస్తోంది. పోషణ కోసం సతీష్‌ చదువు మానేసి మెకానిక్‌ పనిలో చేరాడు. పెద్ద కుమార్తె అనూష (17) ఇటీవలే పదో తరగతి పూర్తిచేసుకుంది. అశ్విని (16) పది, స్పందన (14) ఆరు, మేనక (10) నాలుగో తరగతి చదువుతున్నారు. లక్ష్మి ఇటీవల కరోనాతో మృతిచెందడంతో పిల్లలంతా అనాథలయ్యారు. బాలికల చదువులు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. వీరికి ఊర్లో చిన్న పెంకుటిల్లు తప్ప ఇంకేమీ లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.