ETV Bharat / state

కొత్త సచివాలయ నిర్మాణ పనులపై కొవిడ్ ప్రభావం - Corona for most of the construction work

సచివాలయ పనులపై కొవిడ్ ప్రభావం పడింది. పలువురు కార్మికులతో ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు కరోనా బారిన పడ్డారు. ముందు జాగ్రత్తగా టీకాలు వేయించినప్పటికీ సచివాలయ పనుల్లో పలువురికి పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో నిర్మాణ పనులు బాగా నెమ్మదించాయి. బంగాల్ ఎన్నికల ప్రభావం కూడా సచివాలయ పనులపై పడింది.

hyderabad new secretariat, new Telangana Secretariat building
కొత్త సచివాలయ నిర్మాణ పనులపై కొవిడ్ ప్రభావం
author img

By

Published : May 5, 2021, 12:43 PM IST

కొత్త సచివాలయ నిర్మాణ పనులపై కొవిడ్ ప్రభావం

కొత్త సచివాలయ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా వేగవంతం చేసింది. కీలకమైన పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. సచివాలయ భవన సముదాయం కోసం మొత్తం 194 భారీ పిల్లర్లు నిర్మించారు. ఒక్కో పిల్లర్​కు ఓ రెండు పడకల గదుల ఇంటికి అయ్యేంత సిమెంట్, ఇసుక, కాంక్రీట్ మిశ్రమం పట్టింది. రోజూ రెండు షిఫ్టుల్లో, అవసరమైనప్పుడు మూడు షిఫ్టుల్లో పనులు జరిగాయి. పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యాక గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్‌కు సంబంధించిన పనులను ప్రారంభించారు. స్లాబ్ వేసేందుకు అనువుగా అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే కరోనా రెండో వేవ్ ప్రభావం ఈ పనులపై బాగా పడింది.

కార్మికులతో పాటు

సచివాలయ నిర్మాణంలో దాదాపుగా 2000కు పైగా కార్మికులు ఉన్నారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వర్కర్స్ షెడ్స్ లో వారు ఉంటున్నారు. అయితే కార్మికుల్లో చాలా మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. అధికారులు ముందస్తుగానే కార్మికులకు ఒక డోసు టీకాలు కూడా ఇప్పించారు. అయినప్పటికీ పలువురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. వారందరినీ అక్కడే ఐసోలేషన్​లో ఉంచుతున్నారు. అందులో కొందరు కోలుకున్నారు. కార్మికులతో పాటు ఆర్ అండ్ బీ ఇంజినీర్లు, గుత్తేదారు కంపెనీ తరపు ఇంజినీర్లలో కూడా కొందరికి కరోనా వచ్చింది. దీంతో ఆ ప్రభావం సచివాలయ నిర్మాణ పనులపై పడింది.

పనులపై ప్రభావం

బంగాల్ ఎన్నికల ప్రభావం కూడా పనులపై పడింది. సచివాలయ నిర్మాణ పనుల్లో ఉన్నవారిలో ఎక్కువ మంది బంగాల్ వారే. ఇటీవలి శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం వారు అక్కడకు వెళ్లారు. కొవిడ్ విజృంభణ, లాక్​డౌన్ ఊహాగానాల నేపథ్యంలో వారు అందరూ ఇంకా రాలేదు. శ్లాబ్ కోసం చేస్తున్న పనులు ఇప్పటి వరకు కేవలం 15 శాతం వరకే పూర్తయినట్లు సమాచారం. కొవిడ్ ప్రభావం లేకపోయి ఉంటే ఈ పని దాదాపుగా పూర్తయ్యేదని చెప్తున్నారు. పనులు వేగవంతం అయ్యేందుకు బాగానే సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకుంటున్న గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.