ETV Bharat / state

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 16 మందికి కరోనా - హైదరాబాద్​ తాజా వార్తలు

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 16 మందికి కరోనా

author img

By

Published : Dec 25, 2020, 6:10 PM IST

Updated : Dec 25, 2020, 7:52 PM IST

18:07 December 25

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 16 మందికి కరోనా

యూకే నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిలో 16 మందిలో కరోనా నిర్ధరణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హైదరాబాద్​కి చెందిన 4, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నుంచి 4, జగిత్యాల 2 , మంచిర్యాల,నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు.  

వీరిలో కొత్త రకం వైరస్​ ఉందా లేదా అన్న విషయాలను నిర్ధరించేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపినట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నట్లు సమాచారం. ఇక డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు యూకే నుంచి 1200 మంది రాష్ట్రానికి రాగా వారిలో 926 మందిని గుర్తించి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా అందులో కేవలం 16 మందికి మాత్రమే వైరస్ సోకినట్లు ఆయన ప్రకటించారు.  

మహమ్మారి బారిన పడిన వారిని ఇప్పటికే ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక పాజిటివ్ వచ్చిన వారికి సంబంధించి 76 మంది ప్రైమరీ కాంటాక్ట్​లను గుర్తించామని.. వారందరినీ క్వారంటైన్​లో ఉంచినట్లు తెలిపారు. ఇటీవల యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు 040-24651119 నంబర్​కి కాల్ చేసి లేదా 9154170960 నంబర్​కి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.

 ఇదీ చదవండి: 'భాజపాను అడ్డుకుంటే ఒక్క మంత్రీ గడపదాటలేరు'

Last Updated : Dec 25, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.