తిరుమల వేద పాఠశాలలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. గత వారం 57 మందికి కొవిడ్ నిర్ధరణ కాగా.. పాఠశాల నుంచి కొంతమంది విద్యార్థులు వెళ్లిపోయారు. ప్రస్తుతం వేద పాఠశాలలో ఉన్న 21 మందిలో 10 మంది మహమ్మారి బారిన పడ్డారు.
ఇదీ చదవండి: రాజన్న బిడ్డ షర్మిలకు నా సంపూర్ణ మద్దతు: ఏపూరి సోమన్న