ETV Bharat / state

జీహెచ్‌ఎంసీ పరిధిలో కుంటుపడుతోన్న కార్యకలాపాలు - జీహెచ్‌ఎంసీ పరిధిలో కుంటుపడుతోన్న కార్యకలాపాలు

జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల్లో కరోనా మహమ్మారి భయం తీవ్రమైంది. రోజురోజుకు వైరస్‌ బారినపడుతున్న ఉద్యోగులు పెరుగుతున్నందున.. సర్కిల్‌ కార్యాలయాల్లో భయానక వాతావరణం నెలకొంది. సెలవులు కావాలంటూ సిబ్బంది ఉపకమిషనర్లకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అనుమతి ఇవ్వకపోయినా విధులకు వచ్చేది లేదంటున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కుంటుపడుతోన్న కార్యకలాపాలు

author img

By

Published : Jul 10, 2020, 10:23 AM IST

జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల్లో కరోనా భయం తీవ్రమైంది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికులు కొవిడ్‌ బారినపడ్డారు. వంద మందికిపైగా వైరస్‌ సోకింది. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దానికితోడు రోజురోజుకు మహమ్మారి బారినపడుతున్న ఉద్యోగులు పెరుగుతున్నందున.. సర్కిల్‌ కార్యాలయాల్లో భయానక వాతావరణం నెలకొంది. సెలవులు కావాలంటూ సిబ్బంది ఉపకమిషనర్లకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అనుమతి ఇవ్వకపోయినా విధులకు వచ్చేది లేదంటున్నారు. వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ కార్యాలయాల్లో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిలిచిపోతున్న కార్యకలాపాలు..

నిరంతరం జనంలో తిరుగుతూ కరోనా కట్టడి చర్యలు అమలు చేస్తోన్న దోమల నివారణ విభాగం కార్మికులు, పారిశుద్ధ్య సిబ్బందిలో చాలా మంది కొవిడ్‌కు గురయ్యారు. ఫలితంగా ఆయా విభాగాల కార్యకలాపాలు కుంటుపడ్డాయి. జనన, మరణాల నమోదు, ఆరోగ్యం, ప్రణాళిక విభాగాల్లోనూ అదే పరిస్థితి. కంప్యూటర్‌ ఆపరేటర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, వైద్యాధికారులు కొవిడ్‌తో విధులకు దూరంగా ఉంటున్నారు. దాని ప్రభావం జనన, మరణాల ధ్రువపత్రాల జారీపై పడుతోంది.

పలు విభాగాల్లో అంతర్గత కార్యకలాపాలు ఆగిపోతున్నాయి. పలువురు ప్రణాళిక విభాగం ఉద్యోగులు చికిత్సలో ఉండటం వల్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. స్వచ్ఛ ఆటోల సేవలూ ప్రభావితం అవుతున్నాయి. తాజాగా ఓ స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ కరోనాతో మృతి చెందాడని, తమకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి రక్షణ వస్తువులు అందించట్లేదని ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు అందించాలని కోరుతున్నారు.

కరోనా బాధితులున్న ఇళ్లకు, సాధారణ గృహాలకు చాలా ప్రాంతాల్లో తేడా ఉండట్లేదని, కంటైన్‌మెంట్‌ బోర్డులు లేకపోవడం వల్ల తాము అన్ని ఇళ్లను ఒకేలా పరిగణించి వ్యర్థాలను తీసుకెళ్తున్నామని వారు వాపోతున్నారు. దీర్ఘకాల కిడ్నీవ్యాధితో బాధపడుతోన్న బిల్‌ కలెక్టర్‌కు కరోనా సోకడం వల్ల చనిపోయారని, అతనికి సెలవు ఇవ్వకుండా వేధించిన సర్కిల్‌ ఉన్నతాధికారి బాధ్యత వహించాలని గోషామహల్‌ సర్కిల్‌ యంత్రాంగం డిమాండ్‌ చేస్తోంది. అదే విషయమై తాము కమిషనర్‌కు లేఖ ఇచ్చామని ఉద్యోగులు తెలిపారు.

ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులు, హృద్రోగం, మూత్రపిండాల సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలున్న ఉద్యోగులకు భద్రత కల్పించి, అవసరమైతే సెలవులు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.