ETV Bharat / state

పుచ్చకాయ వ్యాపారాలపై కరోనా పిడుగు.! - వ్యాపారాలపై కరోనా ఎఫెక్ట్

కొవిడ్ సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిరు వ్యాపారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వేసవికాలంలో కొద్దో గొప్పో జరిగే వ్యాపారాలను సైతం దెబ్బతీస్తోంది. ఎంతో ఆశగా పుచ్చకాయల వ్యాపారం చేసుకునే వారి జీవనోపాధిపై కరోనా పిడుగులా వచ్చి పడింది. నగరంలో ఎన్నో ఏళ్లుగా అదే వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి.

corona effect water melon business
చిరు వ్యాపారుల జీవనోపాధిపై కొవిడ్ తీవ్ర ప్రభావం
author img

By

Published : May 9, 2021, 6:05 PM IST

కరోనా మహమ్మారి మనుషులను భయపెట్టడమే కాకుండ లక్షల సంఖ్యలో ఉపాధిని దూరం చేస్తోంది. చిరు వ్యాపారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేసవి కాలం కోసం చిరు వ్యాపారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. కానీ కరోనా గత ఏడాది నుంచి వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఈ కాలంలో పుచ్చకాయలకు మంచి డిమాండ్‌ ఉంటుందని... పది రూపాయలు సంపాదించు కొని జీవనోపాధి పొందవచ్చు అనుకునే వారికి కరోనా రూపంలో తీవ్ర నిరాశే ఎదురవుతోంది.

హైదరాబాద్‌ మింట్‌ కాంపౌడ్‌లోని రావి చెట్టు వద్ద ఎన్నో ఏళ్ల నుంచి ఓ కుటుంబం పుచ్చకాయల వ్యాపారం చేస్తోంది. ఇక్కడ ఏడాది పొడవునా పుచ్చకాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. కానీ గతేడాది నుంచి వ్యాపారం లేక.. పెట్టిన పెట్టుబడి రాక ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వారు నెట్టుకొస్తున్నారు. వేసవి కాలం వచ్చిదంటే చాలు నగరంలోని జనాలంత ఇక్కడే వాలిపోతారు. కానీ కరోనా కారణంగా ఆఫీసులు మూసివేయడం, ఉద్యోగులు ఇంటి వద్దే పని చేయడం కారణంగా అటుగా వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోందని వ్యాపారం చేస్తున్న ఫీరోజ్‌ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా ముందు వేసవి కాలం వచ్చిదంటే ఎంతో పని ఉండేంది. ఇంతకుముందు 8 మంది ఇక్కడ పని చేసే వాళ్లం. ఇప్పుడు కేవలం ఇద్దరమే పని చేస్తున్నాం. గతంలో ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక లేకుండ ఉండేవాళ్లం. ఇప్పుడు జనాలు లేక ఖాళీగా కూర్చుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఎప్పుటి నుంచో తమ కుటుంబం అంతా ఇదే వ్యాపారం చేస్తున్నాం. కరోనా కారణంగా మాకు జీవనోపాధి కరవైంది. -ఫీరోజ్‌ఖాన్‌, పుచ్చకాయల వ్యాపారి

వేసవి కాలంలో వంద శాతం వ్యాపారం జరిగేదని ఇప్పుడు కేవలం 10 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతోందని చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేస్తే కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందనే ఆశతో వ్యాపారం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నగరంలోని చిరువ్యాపారులపై కరోనా ప్రభావం

ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.