ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: భాగ్యనగరంలో కళతప్పిన పర్యటక ప్రదేశాలు...

author img

By

Published : Aug 5, 2020, 5:46 PM IST

భాగ్యనగరం అనగానే గుర్తొచ్చే.. ప్రదేశాలు కోకొల్లలు. పర్యటకులను ఆకర్షించే ప్రదేశాలకు పుట్టినిల్లు హైదరాబాద్​నగరం. ఎప్పుడు పర్యటకులతో, కొనుగోలుదార్లతో కిటకిటలాడే ప్రదేశాలు లెక్కకు మించి ఉంటాయి. ఆదివారం, సెలవు రోజుల్లో అయితే... ఇసుకేసినా రాలనంత జనంతో కిక్కిరిసిపోయే ప్రదేశాలు అనేకం. అలాంటి జనసమర్థ ప్రదేశాలు.. కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్నాయి. జనం లేక బోసిపోతున్నాయి. అక్కడ తాజా పరిస్థితులేమిటో ఓ లుక్కేద్దామా మరి..

CORONA EFFECT ON TOURISM IN HYDERABAD
కరోనా ఎఫెక్ట్​: భాగ్యనగరంలో కళతప్పిన పర్యాటక ప్రదేశాలు...

సుదీర్ఘ చరిత్ర కలిగిన నగరం భాగ్యనగరం. మెట్రోపాలిటిన్‌ నగరాల్లో ఒకటి హైదరాబాద్‌. ఇక్కడ ఎన్నో పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. వీధి మార్కెట్లు అంతకంటే ఎక్కువే ఉంటాయి. ప్రతిరోజు వందల కోట్లు వ్యాపారం జరుగుతుంది. లక్షల సంఖ్యలో చిరు వ్యాపారులు ఉపాధి పొందుతుంటారు. ఆదివారాలు, సెలవు దినాల్లో అయితే... ఇక సందర్శన ప్రదేశాలన్నీ కిక్కిరిసి కనిపిస్తాయి. ఆదివారపు మార్కెట్లతో రహదారులన్నీ కిటకిటలాడతాయి.

వెలవెల...

వేలాది చిరు వ్యాపారులు ఆధారపడి జీవనం సాగించే ఆదివారపు మార్కెట్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. భాగ్యనగరం బోసిపోయి కనిపిస్తోంది. ఎక్కడా జనసందడి కనిపించడం లేదు. సందర్శన ప్రదేశాలన్నీ సందర్శకులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. సండే మార్కెట్లు కొనుగోలుదారులు లేక.. ఈసురోమంటున్నాయి. జనంతో రద్దీగా ఉండే ప్రదేశాలన్నీ కూడా కరోనా ప్రభావంతో...వెలవెలపోతున్నాయి. చాపకింద నీరులా కరోనా వైరస్‌ విస్తరిస్తుండడంతో.. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అత్యవసర పని మీద బయట వచ్చినా... పని పూర్తికాగానే తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. కరోనాతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సక్రమంగా జరగకపోవడం, చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారులు సైతం కరోన కారణంగా ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. దీంతో భవిష్యత్తు ఏలా ఉంటుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో పర్యటక ప్రదేశాల సందర్శనలకు, కొనుగోళ్లుకు మక్కువ చూపడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న జనం డబ్బు వాడకంలో చాలా పొదుపు పాటిస్తున్నారు. పర్యాటక ప్రదేశాలు...సండే మార్కెట్లపై ఆధారపడి జీవనం సాగించే చిరువ్యాపారులు జీవనం కోల్పోయారు. హైదరాబాద్‌ జంటనగరాలతోపాటు పరిసర ప్రదేశాల్లో 80కిపైగా సందర్శన స్థలాలు ఉన్నప్పటికీ చార్మినార్‌, గోల్కొండ, రామోజీ ఫిల్మ్‌సిటీ లాంటి అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పర్యాటక ప్రదేశాలు పరిమితమని చెప్పొచ్చు.

నగరంలోని కొన్ని ప్రదేశాలను చూద్దాం

హైదరాబాద్‌ అనగానే ప్రతి ఒక్కరికి ముందు గుర్తొచ్చేది చార్మినార్‌. కులీకుతుబ్‌ షా నిర్మించిన ఈ కట్టడాన్ని చూసేందుకు దేశ, విదేశ పర్యటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చార్మినార్‌ చుట్టుపక్కల మహిళలకు సంబంధించిన వివిధ అలంకరణ వస్తువులు దొరుకుతాయి. అందుకే చార్మినార్‌ చుట్టూ అనేక డిజైన్లతో కూడిన గాజులు అమ్మే దుకాణాలు కనిపిస్తాయి. సాధారణ రోజుల్లో... సాయంత్ర సమయాల్లో పక్కకు జరిగేందుకు కూడా స్థలం ఉండదు. అంత రద్దీగా ఉంటుంది ఇక్కడ. ఇక ఆదివారం, ఇతర సెలవు దినాల్లో అయితే మరింత రద్దీగా ఉంటుంది. ఆలాంటిది కరోనా దెబ్బతో జనం లేక వెలవెలపోతోంది. దుకాణాలన్నీ ఖాలీగా కనిపిస్తున్నాయి. చార్మినార్‌, పరిసర ప్రాంతాల్లో వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగించే చిరువ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.

గోల్కొండ కోట...

ఇది చాలా పెద్ద కోట. శిధిలావస్థకు చేరినప్పటికీ మళ్లీ మళ్లీ చూడాలనిపించే సుందర కట్టడం. స్థానికులతోపాటు దేశ, విదేశాల పర్యాటకులు కూడా దీనిని పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు. కాని కిటకిలాడే ప్రదేశం... కరోనాతో బోసిపోయి కనిపిస్తోంది. సందర్శకులు లేక వెలవెలబోతోంది.

ఆదివారం రోజున అబిడ్స్‌లో చిరు వ్యాపారుల సందడితోపాటు కొనుగోలుదారులతో కిక్కిరిసి ఉంటుంది. కానీ కరోనాతో ఇక్కడ కొనుగోళ్లు లేక.. చిరువ్యాపారులు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక గోల్కొండ కోటకు సమీపంలో ఉన్న "కుతుబ్ షాహి సమాధులు" ఇబ్రహీం బాఘ్ వద్ద ఉంటాయి. కుతుబ్ షాహి రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు, మసీదులు ఉన్నాయి. వీటిని చూసేందుకు కూడా సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు...కానీ ఇప్పుడు కరోనాతో జనం లేక వెలవెలపోతున్నాయి.

శిల్పారామం....

మాదాపూర్‌ ప్రాంతంలో వెలిసిన దీనిని కళాకారులు తమ ప్రతిభతో చక్కగా రూపొందించిన గ్రామం. నిత్యం ఉరుకులు, పరుగులతో జీవనం సాగించే నగరవాసులకు..ఇది ఉపశమనం కలిగించే ప్రదేశంగా మారింది. నగరవాసులు ఇక్కడకెళ్లితే ఏదో పల్లెకు వెళ్లినట్లు అక్కడి వాతావరణం కట్టిపడేస్తుంది. ఆలాంటి ప్రదేశం కూడా కరోనా దెబ్బతో...విలవిలలాడుతోంది. జన సందర్శనకు నోచుకోకపోవడంతో తాత్కాలికంగా మూసివేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.