ETV Bharat / state

కరోనా బారిన బ్యాంకు ఉద్యోగులు.. భయం భయంగా విధులు

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌.. బ్యాంకింగ్‌ రంగాన్ని భయపెడుతోంది. కొవిడ్‌ నియమనిబంధనలు పాటిస్తూ... విధులు నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణలో మూడువేల మందికిపైగా బ్యాంకర్లు కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకు 36 మంది ఉద్యోగులు వైరస్‌తో చనిపోవడం వల్ల భయం, భయంగానే బ్యాంకర్లు విధులు నిర్వహిస్తున్నారు. యాభై సంవత్సరాలు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన అధికారులైతే తమ ఛాంబర్లలోకి సహచర అధికారులను సైతం రాకుండా ఆంక్షలు విధించారు.

కరోనా బారిన బ్యాంకు ఉద్యోగులు.. భయం భయంగా విధులు
కరోనా బారిన బ్యాంకు ఉద్యోగులు.. భయం భయంగా విధులు
author img

By

Published : Aug 21, 2020, 6:25 PM IST

ప్రపంచాన్ని తలకిందులు చేస్తోన్న కరోనా వైరస్‌... భారత దేశంలోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మంగళవారం వరకు 27లక్షలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 51వేల మందికిపైగా కరోనా కాటుకు బలయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, పారిశుధ్యం, మీడియా ఇలా కరోనాతో ముందుండి పోరాటం సాగిస్తూ... అధిక సంఖ్యలో కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌ రంగాన్ని కూడా కరోనా వైరస్‌ కకలావికలం చేస్తోంది. బ్యాంకర్లలో అలజడి రేపుతోంది. బ్యాంకుల యాజమాన్యాలు... కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచిస్తున్నా... క్షేత్ర స్థాయిలో ఆచరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అవసరమైన మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా... వైరస్‌ బారిన పడుతున్నట్లు బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా కాటుకు 36 మంది బ్యాంకు ఉద్యోగులు చనిపోవడం వల్ల విధులు నిర్వహిస్తున్న బ్యాంకర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులకు చెందిన 3152 మందికి కరోనా సోకింది. ఇందులో భారతీయ స్టేట్‌ బ్యాంకుకు చెందిన దాదాపు 750మంది ఉండగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన 456, బ్యాంకు ఆఫ్‌ బరోడాకు చెందిన 255, సెంట్రల్‌ బ్యాంకుకు చెందిన 150మంది, బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు చెందిన 78 మంది ఉన్నట్లు బ్యాంకు అధికారుల ఫెడరేషన్‌ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్‌ తెలిపారు. దీంతో బ్యాంకర్ల కుటుంబాలు సైతం తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. యాభై సంవత్సరాలు వయస్సు పైబడిన, ఇతర దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న ఉద్యోగులు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులుగా ఉన్న వారైతే తమ ఛాంబర్లల్లోకి తోటి అధికారులు కూడా రాకుండా ఆంక్షలు విధించారు. పాలనాపరమైన అవసరాలు ఉన్నప్పటికీ వీలైనంత వరకు ఫోన్‌ల ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ముఖ్యమైన అంశాలను చర్చించాల్సి వస్తే.... ఆరు అడుగులు దూరం ఉండేట్లు సమావేశ మందిరాల్లో సీటింగ్‌ అరేంజ్‌ చేయించి.. ముందు శానిటైజ్‌ చేస్తున్నారు. ఆ తరువాత పరిమిత సంఖ్యలో అధికారులు సమావేశమై చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇక ఉద్యోగులైతే విధులు నిర్వహణకు చొరవ చూపడం లేదు. కొందరు ఉద్యోగులు ఏదొక సాకుతో సెలవు పెట్టి ముఖం చాటేస్తున్నారు. ఇంకొందరు విధులకు వచ్చినా... భయం భయంగా పని చేస్తున్నారు. బ్యాంకు యాజమాన్యాలు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మేర చర్యలు తీసుకున్నప్పటికీ.. విధులకు హాజరవుతున్న బ్యాంకర్లు ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తున్నారు. బ్యాంకు యాజమాన్యాలు శానిటైజర్లు, మాస్క్‌లు, ఫేస్‌ సీల్డ్‌లతోపాటు కొన్ని యాజమాన్యాలు ఖాతాదారులతో నేరుగా సంబంధాలున్న ఉద్యోగులకు పీపీఈ కిట్లు కూడా సమకూరుస్తున్నారు.

బ్యాంకర్ల పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతుండడం వల్ల ఇప్పటికే మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లను కలిసి బ్యాంకర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరినా... ఆశించిన స్పందన లేదని ఆల్‌ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు నాగేశ్వర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందువల్లనే బ్యాంకర్లు కరోనా బారిన పడుతున్నారన్న ఆయన ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల సమస్యను అర్థం చేసుకుని తమ వినతులను పరిష్కరించేందుకు వీలుగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు నాగేశ్వర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మరొకవైపు బ్యాంకింగ్‌ సేవలకు నేరుగా బ్యాంకులకు రాకుండా అవకాశం ఉన్నంత మేరకు డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.