జంట నగరాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం అల్లాపూర్ డివిజన్లో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మల్కాజిగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఒకే సారి 46 మందికి పాజిటివ్ నిర్ధరణ అవటంతో ఆస్పత్రిలో భయాందోళనలు నెలకొన్నాయి. బాధితుల్లో ఐదు నెలలు, రెండేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు.
ఆస్పత్రిలో పనిచేస్తున్న నలుగురు వైద్యులు, ఆయాకు వైరస్ సోకింది. జీహెచ్ఎంసీ యూసుఫ్గుడా సర్కిల్-19 పరిధిలో 41 మందికి కరోనా సోకింది. వైరస్‌పై ఇంటింటి సర్వే చేసిన ఆశా వర్కర్లకు మహమ్మారి సోకింది. బోరబండ డివిజన్లో 11, వెంగళరావునగర్ డివిజన్లో 6, ఎర్రగడ్డ డివిజన్లో 11, యూసుఫ్‌గూడ డివిజన్లో 8, రహ్మత్ నగర్ డివిజన్లో 5, హయత్‌నగర్‌లో 5, పెద్ద అంబర్‌పేట్‌లో రెండు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.
శంషాబాద్‌లో కొత్తగా ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. సికింద్రాబాద్ చిలకలగూడ ఠాణా పరిధిలో 34 మందికి వైరస్ సోకింది. సెలూన్ షాప్ నిర్వహకుడితో పాటు మరో నలుగురికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీదేవి నర్సింగ్ హోమ్ వైద్యుడికి, సిబ్బందికి కరోన నిర్ధరణ అయింది. అంబర్ పేట నియోజక వర్గ పరిధిలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంబర్‌పేట తురబ్ నగర్, ప్రేమ్ నగర్, పటేల్ నగర్ పరిధిలో ముగ్గురు కరోనాతో మరణించారు.
ఇవీ చూడండి: 'వివాహానికి దేశం కాదు.. ప్రేమ ముఖ్యం'