ETV Bharat / state

18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు కరోనా కేసులు - తెలంగాణలో కరోనా వ్యాప్తి

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ మంగళవారం నివేదిక విడుదల చేసింది. ఈ నెల 1 నుంచి 18 వరకు కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు 4.17 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. గడిచిన 18 రోజుల్లో కోలుకున్నవారి శాతం 81.57 నుంచి 90.48 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించింది.

corona-cases-in-under-control-at-telangana
18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు.. నివేదిక వెల్లడి
author img

By

Published : May 19, 2021, 9:49 AM IST

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నట్లు వైద్యారోగ్య వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 3 వేలు దాటింది. తాజాగా 27 మంది ఈ మహమ్మారితో మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 3,982 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు విడుదల చేశారు.

  • ఈ నెలలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన విధానాన్ని కూడా వైద్య, ఆరోగ్య శాఖ ఆ నివేదికలో వివరించింది. ఈనెల 1న 7,430 కొత్త కేసులు నమోదైతే.. 18న 3,982 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
  • మార్చి 1న 9.73 శాతం పాజిటివ్‌ రేటు నమోదవగా.. ఈ నెల 18న 5.56 శాతానికి తగ్గింది.
  • ఇందులోనూ తొలివారం గడిచేసరికి 8.69 శాతానికి తగ్గగా.. రెండోవారం ముగిసే సరికి 7.22 శాతానికి తగ్గుముఖం పట్టింది.
  • గతేడాది సెప్టెంబరు 3 నాటికి 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స అందగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 112కు పెరిగింది. ప్రభుత్వ వైద్యంలో పడకలు కూడా 8,052 నుంచి 15,297కు పెరిగాయి. అలాగే గత సెప్టెంబరు 3 నాటికి 194 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందగా.. ప్రస్తుతం 1,153 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ చికిత్స చేస్తున్నారు. ప్రైవేటులో పడకల సంఖ్యను కూడా 10,180 నుంచి 38,459కు పెంచారు.

కొత్తగా 3,982 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రవ్యాప్తంగా 71,616 పరీక్షలు నిర్వహించారు. మరో 2,149 పరీక్షల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 607 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 262, ఖమ్మం 247, మేడ్చల్‌ మల్కాజిగిరి 225, కరీంనగర్‌ 188, నాగర్‌కర్నూల్‌ 146, భద్రాద్రి కొత్తగూడెం 142, వరంగల్‌ నగర 142, నల్గొండ 139, పెద్దపల్లి 133, సూర్యాపేట 133, వికారాబాద్‌ 130, మహబూబ్‌నగర్‌ 129, వరంగల్‌ గ్రామీణ 129, సంగారెడ్డి 114, మంచిర్యాల 109, సిద్దిపేట జిల్లాలో 104 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100 కంటే తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి.

పాజిటివ్ కేసుల వివరాలు

ఇదీ చూడండి: మరో రూ.2వేల కోట్ల అప్పు తీసుకున్న ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.