తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,07,329 నమూనాలను పరీక్షించగా.. 582 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,47,811కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారికి ముగ్గురు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 3,817కు పెరిగింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 8,744 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 98.06 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 83 కేసులు నమోదైనట్లు తెలిపింది.
ఇదీ చదవండి: ప్రపంచంపై 'డెల్డా' పడగ- ఆ నగరంలో ఆరోసారి లాక్డౌన్