ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం వల్ల.. ఇప్పటివరకూ కేసుల సంఖ్య 17వేల 699కి చేరాయి. కరోనాతో మరో 12 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 218 కి చేరింది. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32 మందికి కరోనా సోకింది. ఇతర దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా వచ్చింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 9,473 మంది బాధితులు ఉండగా... 8,008 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 24,962 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.