ముషీరాబాద్ నియోజకవర్గంలో సుమారు 104 కరోనా కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గంలోని రామ్నగర్, అడిక్మెట్, కవాడిగూడ, గాంధీనగర్, ముషీరాబాద్, బోలాక్ పూర్ డివిజన్లలో లాక్డౌన్ ఉపసంహరణ తర్వాత కరోనా పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.
కేసులతోపాటు కరోనా పాజిటివ్ వచ్చిన వారి మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత నెల 25 నుంచి నేటి వరకు ఐదుగురు మృతి చెందారు. కేసులు సంఖ్య పెరగడం వల్ల ప్రజల్లో భయాందోళన మరింత పెరుగుతోంది. ఆశా వర్కర్లు ప్రజలకు అనేక జాగ్రత్తలు చెబుతూ సర్వేలు జరపుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది అనుమానిత ప్రాంతాల్లో రసాయనాలను పిచికారీ చేస్తున్నారు.
ముషీరాబాద్ బాకారంకు చెందిన 82 ఏళ్ల వ్యక్తికి పది రోజుల క్రితం కరోనా కాటుకు గురై మృత్యువాత చెందాడు. విద్యానగర్లో ఓ వ్యక్తికి ఈనెల 7న కరోనా పాజిటివ్, అదే ఇంట్లో ఉన్న నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారందరికీ కరోనా సోకింది. విద్యానగర్ అచ్యుత్ రెడ్డి ప్రాంతంలో 42 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. కవాడిగూడలో 60 ఏళ్ల వ్యక్తికి కొవిడ్-19 సోకిందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి : కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందా.. అయితే ఏం చేయాలంటే..