ETV Bharat / state

కరోనాతో వృద్ధుడి మృతి.. భయంతో ఇరుగుపొరుగు - తెలంగాణలో ఈ రోజు కరోనా మృతులు

హైదరాబాద్​లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇవాళ ముషీరాబాద్​ నియోజకవర్గంలో కొవిడ్​-19తో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికీ పాజిటివ్​ నిర్ధరణ అయింది. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Corona Cases at Musheerabad in Hyderabad
ముషీరాబాద్​లో కరోనాతో వృద్ధుడి మృతి
author img

By

Published : Jun 2, 2020, 7:26 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలోని కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. బోలక్​పూర్​, రాంనగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు మరింత పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 16 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

పద్మశాలి కాలనీలో కొవిడ్ -19 పాజిటివ్ వచ్చిన 77 ఏళ్ల వ్యక్తి ఇవాళ మృతి చెందాడు. మరో ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్​ వచ్చింది. ఇప్పటివరకూ నియోజకవర్గంలో రెండు కరోనా మరణాలు చోటుచేసుకోవటం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.