ETV Bharat / state

వ్యాక్సిన్ వేయడం లేదంటూ పీహెచ్​సీలో వివాదం - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్ బోలక్​పూర్​లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వ్యాక్సిన్ వేయడం లేదంటూ ప్రజలు సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. రెండు, మూడు రోజుల క్రితం బుక్ చేసుకున్న వారికి టీకా ఇవ్వొద్దని తమకు ఆదేశాలున్నాయని సిబ్బంది చెప్పగా.. ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.

Controversy in bolakpur phc, hyderabad news

author img

By

Published : May 8, 2021, 4:47 PM IST

ముషీరాబాద్ బోలక్​పూర్​లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేయడం లేదంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై మండిపడ్డారు. నాలుగు రోజులుగా మొదటి, రెండో డోసు కోసం స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పటికీ టోకెన్లు మాత్రమే ఇస్తున్నారని.. వ్యాక్సిన్ మాత్రం ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏరోజు బుకింగ్​ చేసుకున్నవారికి ఆరోజు మాత్రమే వ్యాక్సిన్ వేయాలని.. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ప్రజలకు సిబ్బంది చెప్పడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. రెండు, మూడు రోజుల క్రితం బుక్ చేసుకున్న వారికి టీకా ఇవ్వవద్దని చెప్పారన్నారు.

ఆరోగ్య కేంద్రం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అయినప్పటికీ ప్రజలు తమకు వ్యాక్సిన్లు ఇస్తే గానీ ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఏరోజుకారోజు కొత్త నియమాలతో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వయో వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.

ఇదీ చూడండి: ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.