ETV Bharat / state

'కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు' - CM KCR

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ ద్వారా వేతనాలు అందించడం.. చారిత్రాత్మకమైన నిర్ణయమని ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్(CM KCR)​ ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.

contract lecturer applicable new pay scale in telangana
'కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు'
author img

By

Published : Jun 19, 2021, 9:52 AM IST

కాంట్రాక్ట్ అధ్యాపకుల మినిమం టైం స్కెల్ హర్షణీయమని.... ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లిస్తామని... సీఎం కేసీఆర్(CM KCR)​ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు మినిమం పే స్కేల్ కల్పిస్తూ.. ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులివ్వడం, కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల సీఎం కేసీఆర్​కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఐదు వేల పైచిలుకు కాంట్రాక్టు అధ్యాపకులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

మాటలతోనే కాకుండా చేతులతో తెలంగాణ తొలి పీఆర్సీ ద్వారా వేతనాలు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ ఉత్తర్వులు జారీ చేసేలా తోడ్పాటు అందించిన మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చూడండి: Fake seeds: నకిలీ విత్తనాలపై కొరడా.. వేల క్వింటాళ్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.