జులై 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా వేడుకలు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ.. ఓ చిరునవ్వును ఆయన పేరున కానుక ఇచ్చే ఓ వినూత్న కార్యక్రమంతో కేటీఆర్ అభిమానులు ముందుకెళ్తున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఈ కార్యక్రమంలో భాగంగా ఇబ్బందిలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి సాయం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో గిఫ్ట్ ఏ స్మైల్ హ్యాష్ టాగ్‌తో పోస్ట్ర్లతో ట్రెండ్ అవుతున్నాయి.
గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఎమ్మెల్సీ నవీన్ రావు ఓ స్వచ్ఛంద సంస్థ పునరుద్ధరణ పనులకు విరాళం ఇచ్చారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మసీదుల్లో హ్యాండ్ స్ప్రేయర్లు, చాదర్‌లను విరాళంగా ఇచ్చారు. తెరాస నాయకుడు కర్నటి విద్యాసాగర్ ఓ దివ్యాంగునికి ఎలక్ట్రిక్ వీల్ చైర్‌ను ఇచ్చి అతని మోములో చిరునవ్వును కలిగించారు.
ఇలా ఒక్కో అభిమాని, కార్యకర్త ఒక్కో విధంగా ఓ మంచిపని చేసి.. తద్వారా ప్రతిఫలంగా వచ్చే చిరునవ్వులను తమ ప్రియతమ నేతకు కానుకగా ఇస్తున్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?