ETV Bharat / state

రాజస్థాన్‌ రాళ్లతో సచివాలయానికి సోయగాలు

సచివాలయ నూతన భవనానికి రాజస్థాన్‌ రాళ్లతో సొగసులు అద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాజస్థాన్‌లోని ధోల్పూర్‌ రాతితో నగిషీలు అద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. భవనం ముందు వైపున కిందిభాగంలో కొంత, పైభాగంలో కొంతమేర ఎరుపు రంగు రాతి పలకలను వినియోగించనున్నారు.

రాజస్థాన్‌ రాళ్లతో సచివాలయానికి సోయగాలు
రాజస్థాన్‌ రాళ్లతో సచివాలయానికి సోయగాలు
author img

By

Published : Feb 18, 2021, 8:13 AM IST

ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ నూతన భవనానికి రాజస్థాన్‌ రాళ్లతో సొగసులు అద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరే ఇక్కడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్‌లోని ధోల్పూర్‌ రాతితో నగిషీలు అద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. భవనం ముందు వైపున కిందిభాగంలో కొంత, పైభాగంలో కొంతమేర ఎరుపు రంగు రాతి పలకలను వినియోగించనున్నారు.

భవనం మధ్య భాగంలో బీజ్‌ రంగు రాతి పలకలను వినియోగించేలా నమూనాలను రూపొందించారు. రాజస్థాన్‌లోని ధోల్పూర్‌ రాతిని వాడితే భవనం మరింత ఆకర్షణీయంగా ఉంటుందని ఆర్కిటెక్ట్‌ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. కొన్ని నమూనాలు చూపటంతో ఆయన సుముఖత వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆవరణలో ఉన్నట్లే కొత్త సచివాలయంలోనూ భవనం ముందు కుడి, ఎడమ భాగాల్లో రెండు ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

వీటిని కిందిభాగంలో ఎరుపు, మిగిలినదంతా తెలుపు రంగు రాళ్లతో నిర్మిస్తారు. పార్లమెంటు ఫౌంటెయిన్ల తీరు తెన్నులు, ఎత్తు, విస్తీర్ణం, ఎలివేషన్‌ కోసం వినియోగించిన రాతి పలకలను చూసి రావాలని, రాజస్థాన్‌ వెళ్లి యంత్రాల ద్వారా కాకుండా మనుషులతో చెక్కించిన రాతి పలకలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. ఆయనతోపాటు అధికారులు, గుత్తేదారు, ఆర్కిటెక్ట్‌ ప్రతినిధులు శుక్ర, శనివారాల్లో దిల్లీ, రాజస్థాన్‌ వెళ్లనున్నారు.

ఇదీ చూడండి: 'రామోజీ ఫిల్మ్​ సిటీ' పర్యటకం మళ్లీ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.