CWC Meetings in Hyderabad 2023 : నూతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో (Congress working Committee) కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర నేతలు పాల్గొన్నారు. నాలుగు గంటలకుపైగా జరిగిన సమావేశంలో పలు తీర్మానాలను సీడబ్ల్యూసీ ఆమోదించింది. రాజకీయ, ఆర్థిక పరిస్థితులతోపాటు.. దేశం లోపల, సరిహద్దు వెలుపల ఉన్న భద్రతా పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ నేడు విస్తృతస్థాయి సమావేశం
CWC Fires on BJP : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని దశాబ్దాల కాలం వెనక్కి తీసుకెళ్లిందని.. అన్ని రంగాల్లోనూ తీవ్ర వైఫల్యం చెందిందని సీడబ్ల్యూసీ (CWC Fires on BJP) ఆక్షేపించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అంతర్గత భద్రత, చైనా దురాక్రమణ, రాజ్యాంగంపై దాడి, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడం ద్వారా మోదీ సర్కారు దేశాన్ని తిరోగమన దిశలో పయనింపజేస్తోందని మండిపడింది. విచారణ సంస్థలను రాజకీయ కక్ష సాధింపుల కోసం దుర్వినియోగం చేస్తోందని.. బీజేపీ ఓటమి పాలైన రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించింది.
"దేశంలో ప్రస్తుతం రాజ్యాంగ, సమాఖ్య విధానానికి సవాల్‌గా మారింది. ఓ పద్ధతి ప్రకారం సమాఖ్య విధానాన్ని బలహీనం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వాలను నిష్క్రియాత్మంగా మార్చే కుట్ర జరగుతోంది. రాష్ట్రాలకు రాజ్యాంగ బద్దంగా రావాల్సిన రెవెన్యూను కేంద్రం క్రమంగా తగ్గిస్తోంది. కర్ణాటక ఎన్నికల హామీగా పేదప్రజలకు బియ్యం అందిస్తానంది. భారత ఆహారసంస్థకు డబ్బులు చెల్లించి బియ్యం కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఆ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరిస్తోంది. ఇలాంటివి దేశంలో గతంలో ఎపుడూ జరగలేదు. హిమాచల్‌ప్రదేశ్ తీవ్ర వరదలతో ఘోరంగా నష్టపోయింది. హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రాన్ని సాయం కోరినా.. ప్రధానమంత్రి కనీసం పట్టించుకోలేదు. ప్రకృతి విపత్తు నిధులను విడుదల చేయకుండా అడ్డుకున్నారు. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారం కోల్పొయామనే అక్కసుతోనే ఈ విధంగా చేస్తున్నట్లు చిన్నపిల్లవాడికైనా తెలుస్తోంది." - పి.చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముందుకుసాగాలని సీడబ్ల్యూసీ ఆకాంక్షించింది. దేశంలో విలువైన ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం. కొందరు పెట్టుబడిదారీ మిత్రులకు అప్పగిస్తోందని ఆక్షేపించింది. కేంద్రం ఆర్భాటపు, ప్రచారం రాజకీయాలు మాని.. ప్రగతివైపు పయనించాలని సూచించింది. నినాదాలతో దేశం అభివృద్ధి చెందదని.. సీడబ్ల్యూసీ చురుకలు అంటించింది. కులగణన తక్షణం చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితిని పెంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. మణిపూర్, కశ్మీర్ సహా పలు అంశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తీవ్ర వైఫల్యం చెందారని మండిపడింది.
"మే 5 నుంచి మణిపూర్ రావణకాష్ఠంలా మండిపోతోంది. ఆ సమయంలోనే ఎన్నోదేశాలను సందర్శించిన ప్రధానమంత్రి.. ఆసియాన్ సదస్సు, జీ-8 సమావేశాలకు హాజరయ్యారు. కానీ మణిపూర్‌ను పరిస్థితిని సమీక్షించేందుకు కనీసం రెండు నిమిషాల సమయాన్ని కేటాయించకపోవడం విచారకరం. దిల్లీ నుంచి రెండు గంటల్లో మణిపూర్‌కి విమానంలో వెళ్లవచ్చు.. కానీ ఆ సమయం కూడా ప్రధానికి లేదు." - పి.చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై లేఖ రాసిన సోనియా గాంధీని సీడబ్ల్యూసీ అభినందించింది. దేశాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర దోహదం చేసిందని పేర్కొంది. రాజకీయ ప్రతీకార చర్యపై సత్యం, న్యాయం గెలిచి.. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం తిరిగి పునరుద్ధరించబడిందని సంతృప్తి వ్యక్తం చేసింది. పెరుగుతున్న నిరంకుశత్వం, ప్రజాస్వామ్య సంస్థలను గుప్పిట్లోకి తీసుకోవడం, సమాఖ్య నిర్మాణంపై దాడిని నిరోధించాలని.. రాజకీయాల్లో పెరుగుతున్న అసమానతలు, పడిపోతున్న ఆదాయాలు, అధికమవుతున్న నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించింది.
Tummala Join Congress : మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల
విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమిని బలంగా ముందుకు తీసుకెళ్లాలని.. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు జరగాలని నేతలు తెలిపారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అంశాన్ని రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తిపై దాడిగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. ఒకే దేశం ఒకే ఎన్నికల అంశాన్ని తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది.
"ఒక దేశం-ఒక ఎన్నికలు ప్రతిపాదన రాజ్యాంగంపై దాడి వంటిది. దీనిని మేం తిరస్కరిస్తున్నాం. ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి. దీనికి.. కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం. రాజ్యాంగ సవరణలు ఆమోదం పొందడానికి.. అవసరమైన మెజార్టీ తమకు లేదని బీజేపీకి తెలుసు. ప్రస్తుతం రగులుతున్న అంశాల నుంచి.. ప్రజల దృష్టి మరల్చేందుకే ఒక దేశం-ఒకే ఎన్నికలు అంశాన్ని ముందుకు తెస్తోంది. పైగా తప్పుడు ప్రచారం చేస్తోంది. జమిలి ఎన్నికల ఆలోచనను కాంగ్రెస్ పూర్తిగా తిరస్కరిస్తోంది." - పి.చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల నేతలు పరిస్థితులపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించారు. తెలంగాణకు సంబంధించి సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేశారు. బంగారు తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఆ ఆశయాలు నెరవేరలేదని.., కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని సీడబ్ల్యూసీ ఆక్షేపించింది.
కుటుంబ పాలనతో కేసీఆర్ ప్రజల గొంతు నొక్కుతూ నిజంలా వ్యవహరిస్తున్నారని సీడబ్ల్యూసీ మండిపడింది. పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో వనరుల్ని దారి మళ్లించారని అభిప్రాయపడింది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కర్ణాటకలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు ప్రారంభించామని.. ఇప్పటికే చేసిన డిక్లరేషన్లకు తోడు.. తెలంగాణకు ఆరు గ్యారంటీలను ఇవాళ ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఉద్యమ ఆకాంక్షలను హస్తం పార్టీ నెరవేరుస్తుందని స్పష్టం చేసింది.
CWC Meeting Second Day : నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఎల్పీ నేతలూ ఉదయం జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చించనున్నారు. వివిధ అంశాలపై ఇవాళ్టి సమావేశంలో మరింత విస్తృతంగా సమాలోచన చేయనున్నారు.
CWC Meeting Started at Hyderabad : హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశాలు
Congress Vijayabheri Sabha Today : తుక్కుగూడ వేదికగా.. నేడు కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖం