రాష్ట్రంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం ఉద్ధృతం చేయాలని హస్తం పార్టీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇవాళ యురేనియం వ్యతిరేక పోరాట కమిటీని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు. కమిటీ ఛైర్మన్‌గా మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంత రావు, కన్వీనర్‌గా నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, కో - కన్వీనర్‌గా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిలతో కలిపి 16 మందితో కూడిన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ వైస్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, నల్గొండ మాజీ జడ్పీ ఛైర్మన్ బాలు నాయక్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌లు ఉన్నారు.
ఇవీ చూడండి:'బీసీలకు అప్పుల్లో వాటా ఉంది... కానీ ఆస్తుల్లో లేదు'