Congress Two Guarantees Implementation in Telangana : ఎమ్మెల్యేగా గెలుపొందాక మొదటిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నూతన ఎమ్మెల్యేలకు ప్రజలు ఘన స్వాగతం(Warm Welcome) పలుకుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి స్థానిక పూజారులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పర్యటించగా, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి వచ్చిన ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన ఆయన, పట్టణంలోని కాంటా చౌరస్తాలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణాన్ని ప్రారంభించారు. పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి(State Medical Health Minister) దామోదర్ రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో మహాలక్ష్మీ , రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను జిల్లా పాలనాధికారి శరత్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు.
బస్సులో మహిళకు టికెట్‌పై చార్జీ - తర్వాత ఏమైందంటే?
సంగారెడ్డి జిల్లా ప్రాంతానికి 50 పడకల ఆసుపత్రి తీసుకురాబోతున్నానన్న విషయాన్ని ప్రజలందరికీ సవివరంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరు సహకరించి, ఆశీర్వదించండి. రాబోయే అయిదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏమాటైతే ఇచ్చిందో, అవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో విజయవంతంగా ప్రతీఒక్క వాగ్ధానాన్ని నెరవేరుస్తాం. -దామోదర్ రాజనర్సింహా , రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
Mahalakshmi Scheme Implementation in Telangana : కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా కలెక్టర్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మహిళ ప్రయాణికులకు(Women Passengers) జీరో టికెట్ అందజేసి వారితో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహాలక్ష్మి పథకాలను పలువురు అధికారులు ప్రారంభించారు.
ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదన్న పెద్దలకు ప్రజలు ఓటుతో చెంపచెల్లుమనిపించారు : భట్టి విక్రమార్క
మహబూబాబాద్‌లో మహాలక్ష్మి పథకంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపును ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకొని ప్రయాణించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపలిల్లోని మహిళలతో, కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బస్సులో ప్రయాణించారు. గ్రామంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించిన ఆయన, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు(Congress Six Guarantees) అమలు చేస్తామని తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండులో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గనికి వచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. డిచిపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే, మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
Clash Between Congress and BRS Party Workers : మరోవైపు ప్రోటోకాల్ విషయంలో పలు జిల్లాల్లో వివాదాలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మహాలక్ష్మి కార్యక్రమ ప్రారంభానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ఆహ్వానించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం(Arogyashri Scheme) ప్రారంభించిన ఆమె, అధికారులపై మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, భారాస శ్రేణులు పరస్పరం వాగ్వాదానికి దిగాయి.
ప్రోటోకాల్ వివాదం - స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్న సునీత లక్ష్మారెడ్డి
మరోవైపు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆరోగ్యశ్రీ ,మహాలక్ష్మి పథకం ప్రారంభ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలపై ఎమ్మెల్యే మాట్లాడుతుండగా, అధికార పార్టీ నాయకులు ప్రస్తుత పథకాలపై మాట్లాడటంపై గొడవ రాజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అతివలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో మహిళలతో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. నిర్మల్‌లోని ప్రయాణ ప్రాంగణంలో ఆదిలాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడ్డారు.
రాష్ట్రంలో బీసీ బంధు స్కీమ్ నిలిపివేత - మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన