ETV Bharat / state

అందరూ ఒప్పుకుంటేనే పీసీసీ ఇవ్వాలి: కాంగ్రెస్​ సీనియర్లు - etv bharat

తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక ఏకాభిప్రాయంతో ఉండేలా చూడాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్లు కోరుతున్నారు. మెజారిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోరాదని.. అదే జరిగితే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. నాలుగు రోజులపాటు పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్​ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

congress seniors request  on pcc designation to aicc
అందరూ ఒప్పుకుంటేనే పీసీసీ ఇవ్వాలి: కాంగ్రెస్​ సీనియర్లు
author img

By

Published : Dec 13, 2020, 9:04 AM IST

Updated : Dec 13, 2020, 10:52 AM IST

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ఏకాభిప్రాయం ద్వారా జరగాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు కోరుతున్నారు. మెజారిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోరాదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడి పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయటంతో నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు.

150 మందికి పైగా నేతల నుంచి అభిప్రాయాలు

నాలుగు రోజులపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు, పీసీసీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఇలా 150 మందికి పైగా నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇందులో పీసీసీ అధ్యక్ష పీఠాన్ని కోరుకుంటున్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు, మర్రి శశిధర్ రెడ్డితోపాటు డజన్ మందికి పైగా నేతలు కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారు. పీసీసీ అధ్యక్ష పదవి తమకు వస్తే పార్టీని ఏవిధంగా బలోపేతం చేస్తారో కూడా వివరించారు. 2023లో అధికారమే లక్ష్యంగా ఏమేమి చెయగలరో చెప్పారు.

రేవంత్ రెడ్డికే పీసీసీ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం

అభిప్రాయ సేకరణ ఒకవైపు జరుగుతుండగానే.. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడో జరిగిపోయిందని.. అభిప్రాయ సేకరణ నామమాత్రంగా జరుగుతోందన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఊపందుకుంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఎంపీ రేవంత్ రెడ్డినే నూతన పీసీసీ అధ్యక్షుడు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడం ఇష్టం లేని వారు, మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వారు, గతంలో ఏఐసీసీకి లేఖలు రాసిన వారిలో అంతర్మథనం మొదలైంది. ఎంపిక నిర్ణయం జరిగిపోయిన తర్వాత అభిప్రాయ సేకరణ ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమయింది.

సంయమనం పాటించాలి

ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్​బాబు, పోదెం వీరయ్య తదితరులు నిన్న సీఎల్పీలో ప్రత్యేకంగా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం గాంధీభవన్​లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మణికం ఠాగూర్​ను కలిసి తమ అభిప్రాయాలను ఉమ్మడిగా తెలియచేశారు. మెజారిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవద్దని, అదే జరిగితే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రేవంత్ రెడ్డి పీసీసీగా ట్రోల్ అవుతోందని వివరించారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో మెజారిటీ కాకుండా.. ఏకాభిప్రాయం రావాలని మాణికం ఠాగూర్​ను కోరినట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. సీఎల్పీలో ప్రత్యేకంగా సమావేశమై తామంతా చర్చించుకున్న అంశాలను బయటకు వెల్లడించలేనని చెప్పారు. ఈ పరిణామాలను గమనిస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం ఒక విధానం ఎంచుకుందని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని.. పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం అనుకూలంగా వచ్చినా.. ప్రతికూలంగా వచ్చినా సంయమనం పాటించాలని తమ అభిమానులకు, పార్టీ శ్రేణులకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

Last Updated : Dec 13, 2020, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.