రైతులు బీరయ్య, రాములు మరణాలు ప్రభుత్వ హత్యలేనని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతురావు (Congress Leader Vh) ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో పంటలు కొన్నా... భూసేకరణ డబ్బులు ఇచ్చినా ఈ రెండు ప్రాణాలు బతికేవని అన్నారు. సహజ మరణమని తప్పుడు నివేదికలు ఇస్తున్న కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాములు అనే ముదిరాజ్ రైతు అప్పుల పాలై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కందుకూరు మండలం అన్నొజిగూడా గ్రామంలో 54 మంది రైతులకు ఫార్మాసిటీలో భూములు గుంజుకుని ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే అప్పుల పాలై అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలు కొనలేకపోతే కామారెడ్డి జిల్లాలో బీరయ్య పంటకుప్ప మీద పడి చనిపోయాడని... గుండె కోతతో బీరయ్య చనిపోయాడని పేర్కొన్నారు. తన వంతు చిన్న సహాయంగా రాములు కుటుంబానికి రూ.50వేల సహాయం చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: