ఉస్మానియా విశ్వవిద్యాలయం భూ అక్రమణలపై మంత్రి సబితా ఇందిరా రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారుల స్పందన హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు అన్నారు. 1,600 ఎకరాలకు పైగా ఉన్న యూనివర్సిటీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని... ఆ ఆక్రమణల వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. క్యాట్ ఛైర్మన్ నరసింహ రెడ్డికి భూ కబ్జాలో పాత్ర ఉందని తెలిసినా పోలీసులు దానిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
దేవస్థానాల భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే అమ్మడమేంటని ప్రశ్నించారు. తితిదే ఆస్తుల అమ్మకంపై చిన్న జీయర్ స్వామి-శారదా పీఠాధిపతులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలానే వదిలేస్తే తిరుపతి దేవస్థానం కూడా ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవుని భూములను ముట్టుకుంటే ఆ స్వామి వదిలిపెట్టరని వడ్డితో సహా వసూలు చేస్తారని హెచ్చరించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు