ETV Bharat / state

ఎల్​జీ పాలిమర్స్ ఘటన దురదృష్టకరం: వీహెచ్ - Hyderabad Gandhi bhavan V Hanmantha rao

ఏపీలోని విశాఖలో జరిగిన ఎల్​జీ పాలిమర్స్ ఘటనపై కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు వీ హన్మంతరావు స్పందించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ఫార్మా కంపెనీలు సైతం జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

వీ హన్మంతరావు
వీ హన్మంతరావు
author img

By

Published : May 7, 2020, 11:18 PM IST

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఎల్​జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హన్మంతరావు విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం ఎక్కువ జరగకుండా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆసుపత్రుల్లోని బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనలో బాధ్యులెవరో నిగ్గు తేల్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని ఫార్మా కంపెనీలు సైతం జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని కందుకూరు ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటును రైతులు వ్యతిరేకిస్తున్నారని... ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.

ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.