ప్రజలకు సాయం చేస్తుంటే... ప్రభుత్వం తట్టుకోలేక తమ మీద కరోనా కేసులు పెడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు ఆరోపించారు.
మేము వలస కార్మికులకు సాయం చేసేందుకు వెళ్తే మా మీద కరోనా కేసులు పెడతారు. మేం చేస్తేనేమో తప్పు... మీరు చేస్తే కాదా? హైకోర్టు మొట్టికాయలు వేసే వరకు కరోనా పరీక్షలు నిర్వహించలేదు. అలాంటప్పుడు మీకు తప్పుఒప్పులు గుర్తురావా? ఇన్ని రోజులు లాక్డౌన్ చేసినా... మద్యపానం నిషేధం ఎత్తేశాక కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని ఎక్కువ నమోదు అవుతున్నాయి. అసలు మనుషులు ఉంటారా అనే భయం వేస్తోంది.
-కాంగ్రెస్ సీనియర్ నేత, వీహెచ్
తెలంగాణ రావడానికి కేసీఆరే కారణమని చెప్పుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ చెన్నారెడ్డి హయాం నుంచే ఉద్యమం ప్రారంభమైంది. ఎందరో ప్రాణాలు అర్పించారని వీహెచ్ అన్నారు. మేము చేసిన అభివృద్ధిని కూడా వారి ఖాతాలో వేసుకుంటున్నారంటూ మండిపడ్డారు.
ఇవీ చూడండి: పొరల పొరల ఉల్లిని.. పోషకాల తల్లిని!