Congress Screening Committee Meeting in Delhi : కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దిల్లీలో సాయంత్రం స్క్రీనింగ్ కమిటీ సమావేశమై సుమారు 5 గంటల పాటు చర్చించింది. మొదటి జాబితా(Congress First List) 55 మందితో ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం.. మిగిలిన 64 నియోజకవర్గాల్లో ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్ధుల ఎంపికపై చర్చించామని.. మరోసారి సమావేశం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. సీఈసీ మీటింగ్ తర్వాతే రెండో జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని.. కాంగ్రెస్ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
Telangana Congress Second List Release Date : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో జోరు మీద ఉన్న కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో.. పార్టీ కోసం నాయకులు పని చేసిన సేవలు, సర్వేల్లో వచ్చిన ఆదరణను బేరీజు వేసుకుని అభ్యర్ధి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
"స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్ధుల ఎంపికపై చర్చించాం. అభ్యర్థుల ఎంపికపై ఇంకో సమావేశం జరిగే అవకాశం ఉంది. మిగిలిన అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తాం. సీఈసీ మీటింగ్ తర్వాతే రెండో జాబితా. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది."- ఠాక్రే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి
Congress First List Details : కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 55 స్థానాల్లో మొదటి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో అత్యధికంగా 17 సీట్లు రెడ్డిలకు దక్కగా.. బీసీలకు 12, ఎస్సీలకు 12, ఎస్టీలకు 2, ముస్లింలకు 3.. దక్కాయి. 55 నియోజకవర్గాల్లో ఆరుగురు మహిళలకు సీట్లు లభించాయి. సీట్లు కేటాయించిన ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు కొందరు అసంతృప్తికి లోనయ్యారు. మరికొందరు పార్టీనే విడిచిపెట్టి వెళ్లారు. హస్తం పార్టీ సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నవారిని బుజ్జగించారు. దీనికోసం ఫోర్‌మెన్ కమిటీ(Foremen Committee)ని ఏర్పాటు చేసింది.
Congress Second List Exercise : మొదటి జాబితా విడుదల చేసిన తరవాత ఏవైతే లోపాలు కనిపించాయో అవి పునరావృతం కాకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీ అధిష్టానం రెండో జాబితా విడుదల చేసే ముందే అభ్యర్థుల విషయంలో మరింత కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. వీలైనంత త్వరగా రెండో జాబితాను విడుదల చేయనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మొదటి దశ బస్సు యాత్ర(Congress Buss Yatra)ను ముగించి.. ప్రచారంలో జోరు అందుకుంది.
Rahul Gandhi Jagtial District Tour : రాహుల్ గాంధీని చూసేందుకు పోటెత్తిన ప్రజలు.. ఫొటోస్ చూశారా