ETV Bharat / state

Congress Protest: ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనబాట - ts news

Congress Protest: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్తు ఛార్జీలు తగ్గించేవరకు, రైతులు పండించిన ధాన్యం కొనేదాకా కాంగ్రెస్​ పోరాటం చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రకటించారు. ఇవాళ విద్యుత్​ సౌధ, పౌరసరఫరాల కమిషనర్‌ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్​ పిలుపునిచ్చింది.

Congress Protest: నేడు కాంగ్రెస్​ విద్యుత్​ సౌధ, సివిల్​ సప్లయిస్​ భవన్​ల ముట్టడి

author img

By

Published : Apr 7, 2022, 4:39 AM IST

Congress Protest: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్​ ఛార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ విద్యుత్​ సౌధ, పౌరసరఫరాల కమిషనర్‌ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. ఇవాళ ఈ రెండు కార్యాలయాల ముట్టడికి... పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు తరలిరావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ పిలుపునిచ్చారు. నాయకులు కూడా అందరు పాల్గొనాలని ఆయన సూచించారు. ఉదయం పదిన్నరకు నెక్లెస్‌రోడ్‌ నుంచి ప్రదర్శనగా... విద్యుత్‌ సౌధ వరకు చేరుకుంటారని తెలిపారు. నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో జాతీయరహదారుల దిగ్బంధనం.. కేంద్రంపై తెరాస పోరాటం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.