ETV Bharat / state

VH: హనుమంతరావును ఫోన్​లో పరామర్శించిన సోనియా గాంధీ

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌కు ఫోన్​ చేశారు. వీహెచ్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

v hanumanth rao, sonia
హనుమంతరావు, సోనియా
author img

By

Published : Jul 1, 2021, 5:08 PM IST

కిడ్నీ సమస్యతో హైదరాబాద్​లోని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌కు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీసిన సోనియాగాంధీ.. ఎన్ని రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం ఏలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నిన్న సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌ చేసి.. హనుమంతరావు ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన వీహెచ్‌ ఆరోగ్య పరిస్థితిపై సోనియా, రాహుల్‌ గాంధీలకు తెలియజేశారు. దీంతో ఇవాళ ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సోనియాగాంధీ ఫోన్‌ చేసి హనుమంతరావు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె సూచించినట్లు వీహెచ్‌ తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న వీహెచ్​ను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌, మాజీ మంత్రి గీతారెడ్డి ఇదివరకే పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత గురువారం కిడ్నీ సమస్యతో రావటంతో వీహెచ్​ అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వీహెచ్​ గత సంవత్సరం కరోనా బారిన పడి కోలుకున్నారు. అప్పట్లో పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వీహెచ్​ నిరవధిక దీక్షకు దిగారు. తన నివాసంలోనే ఆయన నాలుగు రోజులుగా దీక్షను కొనసాగించారు.

ఇదీ చదవండి: KTR: ఇంటింటికి నల్లా .. కేసీఆర్​ ఘనతే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.