ETV Bharat / state

Congress PEC Meeting Postponed : సెప్టెంబర్​ 2న జరగాల్సిన కాంగ్రెస్ PEC సమావేశం వాయిదా - సెప్టెంబరు 2న జరగాల్సిన సమావేశం వాయిదా

Congress PEC Meeting Postponed : సెప్టెంబరు 2వ తేదీన జరగాల్సిన కాంగ్రెస్ ప్రదేశ్​ఎలక్షన్​ కమిటీ సమావేశం వాయిదా పడింది. అదే రోజు మాజీ సీఎం వైఎస్సాఆర్​ వర్ధంతితో పాటు పలు కార్యక్రమాలు ఉండడంతో మెజారిటీ సభ్యులు వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు సమావేశాన్ని సెప్టెంబరు 3న నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది.

PEC meeting postponed
Congress PEC meeting postponed
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 8:45 PM IST

Updated : Aug 31, 2023, 8:52 PM IST

Congress PEC Meeting Postponed : రాష్ట్ర కాంగ్రెస్​ ప్రదేశ్​ ఎలక్షన్​ కమిటీ(PEC) సమావేశం వాయిదా పడింది. సెప్టెంబరు 2వ తేదీన జరగాల్సిన ఈ సమావేశం.. అదే రోజున మాజీ సీఎం వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి వర్ధంతి(YS Rajasekhar Reddy Death Anniversary)తో పాటు పలు కార్యక్రమాలు ఉండటంతో మెజారిటీ సభ్యులు వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2న జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబరు 3వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున సాయంత్రం నాలుగు గంటలకు ప్రదేశ్​ ఎలక్షన్​ కమిటీ భేటీ అవ్వనుంది. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పూర్తి వివరాలతో స్క్రూటీని చేయనున్నారు. పీఈసీ సభ్యులతో వ్యక్తిగతంగా స్క్రీనింగ్​ కమిటీ ఛైర్మన్​ మురళీధరన్​, మిగతా సభ్యులు మాట్లాడనున్నారు.

Congress Telangana Assembly Election Plan 2023 : కాంగ్రెస్​ పార్టీ స్క్రీనింగ్​ కమిటీ ఛైర్మన్​ మురళీధరన్​, సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్​ మేవానిలు సెప్టెంబరు 4న హైదరాబాద్​ రానున్నారు. వారు మూడు రోజుల పాటు హైదరాబాద్​లోని బస చేసి.. రాష్ట్రంలోని పీఈసీ సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడనున్నారు. వారితో మాట్లాడిన తర్వాత నివేదికలు రూపొందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తొలి జాబితాలో టికెట్లు కేటాయించాలని ఆగస్టు 29న జరిగిన పీఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా సీట్లను ముందుగానే ప్రకటించాలని సమావేశంలో చర్చించుకున్నారు. ఇదే పీఈసీ సమావేసంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి సీడబ్ల్యూసీకి ఒక లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అందులో సీడబ్ల్యూసీ తొలి సమావేశం హైదరాబాద్​లోని నిర్వహించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయాలని తీర్మానించుకున్నారు.

T Congress MLA Candidates 2023 : కాంగ్రెస్ ముందస్తు అభ్యర్థుల ఎంపికలో జాప్యం.. అదే కారణం!

Pradesh Election Committee Held On August 29 : ఈ నెల 29న జరిగిన పీఈసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిక కోసం వచ్చిన దరఖాస్తులపై చర్చ జరిగింది. దరఖాస్తుదారుల ఎంపిక కోసం వారి పూర్తి వివరాలను పరిశీలించడం జరిగిందని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు.. ఎన్ని సభల్లో పాల్గొన్నారు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రదేశ్​ ఎన్నికల కమిటీకి సంబంధించిన సమావేశం గాంధీభవన్​లో జరిగింది.

Telangana Congress New Strategy : కాంగ్రెస్ స్మార్ట్ మూవ్.. ప్రియాంక, డీకేలకు తెలంగాణ గెలుపు బాధ్యతలు

1009 Applications For Congress MLA Candidates : రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉంటే కాంగ్రెస్​ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడానికి 1009 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క ఇల్లందు నియోజకవర్గంలోనే అత్యధికంగా 38 దరఖాస్తులు రాగా.. కొడంగల్​, జగిత్యాల నియోజకవర్గాలలో కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చింది.

Congress MLA Candidates Selections Process : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో జాప్యం.. సెప్టెంబర్​ 2న మళ్లీ సమావేశం

Congress MLA Tickets Applications 2023 : తరలివచ్చిన ఆశావహులు.. 1000 దాటిన దరఖాస్తులు

Last Updated : Aug 31, 2023, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.