Congress Party speed up Election Campaign : హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాల హోరు కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో(Kukatpally Constituency) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ .. ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ తరఫున ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు.
Revanth Reddy Meet Prof Kodandaram : 'తెలంగాణకు పట్టిన చీడ పీడ వదలాలంటే కోదండరామ్ సహకారం అవసరం'
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో.. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను కాజేసి.. డబ్బు సంచులతో ఓట్ల కోసం నియోజకవర్గాల్లో సంచరిస్తున్నారని ఆరోపించారు. రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించి.. కనీసం ఐదేళ్లు కాకముందే కూలిపోవడం కేసీఆర్ పనితనానికి నిదర్శనమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను పేదప్రజలకు అందిస్తామని తెలిపారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గురించి ఆదివారం కోదాడలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. యాభై.. అరవై యేళ్ల కింద కట్టిన ప్రాజెక్టు విషయంలో అప్పుడు ఎవరో అశ్రద్ధ చేశారని మాట్లాడిన మాటలు విడ్డూరం. అప్పుడు కట్టిన ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఇప్పటికీ కొన్ని లక్షల ఎకరాలకు నీటిని అందిస్తున్నాయి. అలానే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంటే.. అయిదేళ్ల కిందట మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మాత్రం పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక్కడే మీ చిత్తశుద్ధి ప్రశ్నార్థకం.. మీ అవినీతికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. -ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని.. హనుమకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత డోలీ శర్మ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల(Congress Six Guarantees) అమలు ప్రక్రియ చేపడతామని తెలిపారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ .. కోహెడ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాకకోసం ఎదురుచూస్తున్నారని.. అలాగే హుస్నాబాద్ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.
2009 సంవత్సరాన నేను, కేటీఆర్ ఇద్దరం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యాం. కానీ ఇవాళ ఆస్తుల విషయాన నేను ఏ స్థాయిలో ఉన్నా.. కేటీఆర్ ఎక్కడ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. కోట్లకు ఏవిధంగా పడగవిప్పిండు.. తెలంగాణ పేరు మీదనే కదా ఉన్నది మార్పు. ఆత్మగౌరవంతో రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బిడ్డగా..మీ ఆశీస్సులతో, గౌరవంగా ఉన్నానే కానీ నీలా నిందలుతో అవమానం పడే పరిస్థితి లేదన్నారు. పదేళ్లలో కాలంలో తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచ్చిందో చర్చిద్దాం. కేవలం బాగుపడ్డది కేసీఆర్ కుటుంహం మాత్రమే. -పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
Congress Vijayabheri Yatra Postponed : కాంగ్రెస్ బస్సు యాత్ర తాత్కాలికంగా వాయిదా.. కారణం ఇదే..!