ETV Bharat / state

ఎమ్మెల్సీ ప్రచారానికి మొహం చాటేస్తున్న కాంగ్రెస్ సీనియర్లు - ఎన్నికల ప్రచారం

వరుస ఓటములతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్‌... ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో దూసుకుపోతోంది. పట్టభద్రుల స్థానాలు గెలిచి పూర్వవైభవం సాధించాలని భావిస్తోంది. కానీ కొందరు నేతలు ప్రచారానికి దూరంగా ఉండడం కార్యకర్తలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఐక్యంగా సాగాల్సిన నాయకులే అంటీముట్టనట్లుగా ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు దూరంగా ఉంటున్న వారిపై అధిష్ఠానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

congress-party-campaign-internal-disputes-in-telangana
పీసీసీ కోసం పోటీపడ్డారు.. ప్రచారానికి మొహం చాటేస్తున్నారు
author img

By

Published : Mar 11, 2021, 11:43 AM IST

పీసీసీ కోసం పోటీపడ్డారు.. ప్రచారానికి మొహం చాటేస్తున్నారు

మ‌ండ‌లి ఎన్నికల ప్రచారానికి ముగింపు గడువు సమీపిస్తుండడంతో రాజ‌కీయ‌ పార్టీలు దూకుడు పెంచాయి. పార్టీలన్నీ త‌మ అభ్యర్ధుల‌ను గెలిపించుకోవడానికి శ‌క్తివంచ‌న లేకుండా ప‌ని చేస్తున్నాయి. తెరాస‌, భాజపాలో కీలక నేతలు తమ పార్టీ అభ్యర్థుల విజ‌యం కోసం కష్టపడుతున్నారు. పట్టభద్రులను త‌మ వైపు తిప్పుకునేందుకు చెమటోడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పలువురు ముఖ్యనేతలు ప్రచార బరిలో ఉన్నా... అత్యధిక మంది సీనియర్‌ నాయకులు మోహం చాటేస్తున్నారు. పార్టీకి విధేయులుగా ముద్రపడిన ప్రధాన నేతలు సైతం... ఎన్నికల ప్రచారంలో తూతూమంత్రంగానే కనిపిస్తున్నారనే విమర్శలు ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి.

దిశానిర్దేశం చేస్తూ..

వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన రాములు నాయక్‌కు మద్దతుగా... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూమ్ యాప్ ద్వారా వ‌ర్గాల వారీగా స‌మావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క సైకిల్‌ యాత్ర ద్వారా పట్టభద్రులను కలుసుకుంటున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డిని బ‌రిలో దించారు. సీనియర్లు ఎవరూ కనిపించడం లేదని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను ఎంపీ రేవంత్‌రెడ్డి భుజస్కందాలపై మోసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. మండ‌లి ఎన్నిక‌ల్లో ఐక్యంగా పనిచేసి పార్టీ ప‌రువును నిల‌బెట్టాల్సిన నేత‌లు... పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది.

ప్రచారానికి దూరంగా ఉంటూ..

సీనియర్‌ నేతలు జానారెడ్డి, వీహెచ్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పోదెం వీరయ్య, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, గీతారెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కి, మర్రి శశిధర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు పెద్దగా ప్రచారంలో పాల్గొన‌లేదని, పాల్గొన్నా చుట్టపు చూపులా వచ్చి వెళుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్థులతో కలిసి ప‌ని చేయ‌డం లేద‌న్న విమ‌ర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లాలో కీలక నేత, భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదట్లో ప్రచారం చేసినా... ఆ తర్వాత ఆశించినంత‌గా చొర‌వ చూప‌డం లేద‌న్న చ‌ర్చ నడుస్తోంది.

ఇటీవల పీసీసీ అధ్యక్ష పదవికి పెద్ద సంఖ్యలో పోటీ ప‌డ్డ నేత‌లు... ఎన్నిక‌ల‌ ప్రచారానికి దూరంగా ఉండ‌డం పార్టీలో తీవ్ర చ‌ర్చకు దారి తీస్తోంది. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాల్సిన నేతలు... ఆధిపత్యపోరు, అంత‌ర్గత విబేధాల‌తో ప్రచారానికి దూరంగా ఉండటం అభ్యర్ధుల‌ను ఆందోళనకు గురిచేస్తోంది. జానారెడ్డి పూర్తిగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మీదే దృష్టి సారించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి సంబంధించి రేవంత్‌తో కలిసి మల్లు రవి, సీతక్క, పొన్నం ప్రభాకర్ వంటి కొద్ది మంది నేతలు మాత్రమే ప్రచారాన్ని సాగిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా నిలవని నేతలపై అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళుతున్నాయని హస్తం వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారు: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.