ETV Bharat / state

టీఆర్​టీపై సీఎంకు రేవంత్ బహిరంగ లేఖ

author img

By

Published : Oct 4, 2019, 11:19 PM IST

​దిల్లీ పర్యటనలు, ఉప ఎన్నికలపై చూపిస్తున్న శ్రద్ధ టీఆర్​టీ అభ్యర్థుల ఉద్యోగ నియామక ఉత్తర్వులపై లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. టీఆర్టీ ఫలితాలు వెల్లడై రెండేళ్లు గడిచినా.. అర్హత సాధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

రేవంత్‌ రెడ్డి

టీఆర్​టీ ఫలితాలు వెల్లడై రెండేళ్లు గడిచినా.. అర్హత సాధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తాను సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ మార్గంలో వెళ్తుండగా నిరసన తెలుపుతున్న వందల మంది యువతను గమనించినట్లు తెలిపారు. సొంత ఇంటి పంచాయితీ పరిష్కారం కోసం రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్​కు కేబినెట్‌లో స్థానం కల్పించారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల పదవుల పందేరం విషయంలో ఆగమేగాలపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ నిరుద్యోగ బిడ్డల సమస్యల పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు.

ఇవీ చూడండి: త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం... 5 నుంచి సమ్మె

TG_HYD_43_04_REVANTH_LETTER_TO_CM_AV_3038066 Reporter: M. Tirupal Reddy గమనిక: ఫీడ్‌ సీఎల్పీ ఓఎఫ్‌సీ నుంచి వచ్చింది. వాడుకోగలరు. ()ఢిల్లీ పర్యటనలు, ఉప ఎన్నికలపై చూపిస్తున్న శ్రద్ధ టీఆర్టీ అభ్యర్థుల ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వడంపై చూపాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు. టీఆర్టీ ఫలితాలు వెల్లడై రెండేళ్లు గడిచినా అర్హత సాధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తాను సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ మార్గంలో వెళుతుండగా నిరసన తెలుపుతున్నవందల మంది యువతను గమనించినట్లు ఆయన వివరించారు. తక్షణం పోస్టింగులు ఇచ్చి, న్యాయం చేయాలంటూ నినాదాలు ఇస్తుండగా...విషయం ఆరా తీశానన్నారు. టీఆర్టీ ఉద్యోగాల భర్తీ కోసం 2017లో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో తామంతా ఉత్తీర్ణత సాధించామని, ఇప్పటికీ నియామక ఉత్తర్వులు ఇవ్వని విషయాన్ని తన దృష్టికి తెచ్చారన్నారు. పరీక్ష పూర్తై, ఫలితాలు వెల్లడై రెండేళ్లు గడచినా ఎందుకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదన్న విషయం తనను ఆశ్చర్యానికి, ఆవేదనకు గురి చేసిందన్నారు. నియామక ఉత్తర్వులు ఎప్పుడు ఇస్తారో తెలియదు, అసలు ఇస్తారో...ఇవ్వరో తెలియక యువత తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు చెప్పారన్నారు. వయసుమీరిపోతూ, మరో ఉద్యోగ ప్రయత్నం చేయలేక ఎదురు చూపులతో విసిగిపోయారని వివరించారు. సొంత ఇంటి పంచాయితీ పరిష్కారం కోసం రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న మీ కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులకు తక్షణం కేబినెట్‌లో స్థానం కల్పించారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల పదవుల పందేరం విషయంలో ఆగమేగాల పై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ నిరుద్యోగ బిడ్డల సమస్యల పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. తక్షణం ఈ సమస్యకు పరిష్కారం చూపని పక్షంలో రాష్ట్రంలోని మిగతా నిరుద్యోగ యువతను కూడగట్టి అధికార అహంకార, మదంలపై పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాము.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.