హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని ఎంపీ కోమటిరెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. తుర్కయంజాల్‌లోని తులిప్స్ గ్రాండ్ హోటల్‌పై న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్మించిన హోటల్‌ను మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారని ఆరోపించారు.
కోమటిరెడ్డి లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. తులిప్స్ గ్రాండ్ హోటల్‌ను కోర్టు ప్రతివాదిగా చేర్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, హోటల్ యాజమాన్యానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలంటూ ధర్నా