Mlc Jeevanreddy On Employees: ఉద్యోగుల విభజన ప్రక్రియ స్థానికత ఆధారంగానే చేపట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
jeevan reddy on GO: ఈ విషయంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నూతన జోన్, జిల్లాల వారిగా ఉద్యోగుల కేటాయింపు జరిగినప్పుడు స్థానికత ఆధారంగా చేయాలనే అంశాన్ని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కొత్త జిల్లా ఏర్పడిందని.. అక్కడే ఉద్యోగం చేస్తున్న వారిని ఇంకో జిల్లాకు కేటాయించారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఉద్యోగుల స్థానికతలో ఇబ్బందులు వస్తే పిల్లల స్థానికత కూడా మారుతుందన్నారు. ఈ పరిస్థితిలో నిరుద్యోగ యువతకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. జూనియర్ ఉద్యోగుల కేటాయింపు జరిగిన జిల్లాలో కొత్త ఉద్యోగాలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించారు.
వారి స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సీనియారిటీ ప్రతిపాదికన మాత్రమే నూతన జిల్లాలకు కేటాయించడం భారత రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనే. నూతన జిల్లాల ప్రక్రియకు అనుగుణంగా ఉద్యోగుల స్థానికతను పరిగణలోకి తీసుకోవాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లాకేంద్రంగా మారింది. ఇలాగైతే ఉద్యోగుల పిల్లల స్థానికత విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో ఏ విధంగా జారీ చేశారో తెలియడం లేదు. ఇవాళ ఈ విషయాన్ని గవర్నర్ పరిష్కరించాలని కోరుతున్నా. ఈ జీవోను రద్దు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అందరిని దృష్టిలో ఉంచుకుని విభజన చేయాలి. తెరాస ప్రభుత్వం రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది.
- జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ
- ఇవీ చూడండి:
- Mallu Ravi Comments On KCR: 'తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిషేధించారా..?'
- Congress Party 137th Foundation Day: 'దేశానికి పూర్వవైభవం రావాలంటే కాంగ్రెస్ రావాలి'
- TPCC PAC Meeting : అస్త్రశస్త్రాలతో పీఏసీ సమావేశానికి సిద్ధమవుతున్న హస్తం నేతలు
- Revanth Reddy Comments: 'గంజాయి తాగొద్దని చెప్పినందుకు కాంగ్రెస్ నేతను చంపేశారు'