ETV Bharat / state

Congress MLA Ticket Issues in Telangana : కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాల.. అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి ముఖ్యనేతలు - Congress Campaign in Telangana Assembly Elections

Congress MLA Ticket Issues in Telangana 2023 : రాష్ట్ర కాంగ్రెస్‌లో టికెట్ల అసమ్మతి సెగ తగ్గడంలేదు. అసమ్మతివాదులు అనుచరగణంతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. కొందరు రాజీనామా చేస్తుంటే.. మరికొందరు టికెట్‌ ఇవ్వకుంటే రెబల్‌గా పోటీ చేసి తీరతామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ తరుణంలో పార్టీకి నష్టం జరగకుండా ముఖ్యనేతలు రంగంలోకి దిగి టికెట్లు దక్కని వారికి నచ్చచెబుతున్నారు.

Congress
Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2023, 7:41 AM IST

Congress MLA Tcket Issues in Telangana కాంగ్రెస్‌లో ఆగని టికెట్లు రాని నేతల అసమ్మతి జ్వాల

Congress MLA Ticket Issues in Telangana 2023 : కాంగ్రెస్‌ అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటన సమయంలో పెద్దగా అసంతృప్తి కనిపించలేదు. ఎక్కువ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉండటంతో ఆశావహుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే 45మందితో ప్రకటించిన రెండో జాబితాలో సీటు రాని నాయకులు ( Tcket Issues) భగ్గుమంటున్నారు. నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ సీటు ఆశించి భంగపాటుకు గురైన నాగం జనార్ధన్‌రెడ్డి హస్తం పార్టీకి రాజీనామా చేశారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చి ప్రగతిభవన్‌ తీసుకొచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నాగం జనార్ధన్‌రెడ్డి (Nagam Janardhan Reddy) భేటీ అయ్యారు. టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేసిందని నాగం ఆరోపించారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నారు. జూబ్లీహిల్స్ సీటు రాకపోవడంతో అసంతృప్తికి గురైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి.. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహేశ్వరం టికెట్‌ ఆశించి నిరాశకులోనైన పారిజాత నర్సింహారెడ్డి అనుచరులతో సమావేశమై.. కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Telangana Assembly Election Campaign 2023 : రాష్ట్రంలో ప్రచారాల జోరు.. నువ్వా-నేనా అంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

Telangana Congress MLA Tickets Disputes : ఎల్బీనగర్‌లో దీపా భాస్కర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రామిరెడ్డి, నర్సాపూర్‌లో గాలి అనిల్‌కుమార్, తదితరులు అభ్యర్థితత్వం ఖరారు కాక.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ టికెట్‌ ఆశించిన గాలి అనిల్‌కుమార్‌ అనుచరులు గాంధీభవన్‌లో నిరసన చేపట్టారు. ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. డోర్నకల్ టికెట్‌ ఇవ్వాలంటూ భూపాల్ నాయక్‌ వర్గీయులు జల దీక్ష చేపట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలను మార్చాలని జీవకన్ వర్గీయులు డిమాండ్‌ చేశారు.

టికెట్లు దక్కనివారిని బుజ్జగించేందుకు జానారెడ్డి (JanaReddy) నేతృత్వంలోని సమన్వయ కమిటీతోపాటు.. ఐదుగురు ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులు రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా అసమ్మతి నాయకుల జాబితా సిద్ధం చేసుకుని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ఉండడంతో కొంత మందితో ఫోన్‌లో మాట్లాడుతుండగా మరికొందరిని పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు.

Congress Vijayabheri Yatra Postponed : కాంగ్రెస్‌ బస్సు యాత్ర తాత్కాలికంగా వాయిదా.. కారణం ఇదే..!

Telangana Assembly Elections 2023 : ఎల్లారెడ్డిని నుంచి రెబల్‌గా బరిలో దిగుతానని ప్రకటించిన సుభాశ్‌రెడ్డితో మాట్లాడేందుకు.. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇంటికి రావాలని జానారెడ్డి, అశోక్‌చవాన్‌లు ఆహ్వానించారు. అక్కడకు వెళ్లిన సుభాశ్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి (Revanth Reddy), సీతక్కలు ఫోన్‌ చేసినా స్పందించలేదు. హుస్నాబాద్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రవీణ్‌రెడ్డి ఇంటికి.. పొన్నం ప్రభాకర్‌ వెళ్లినా ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. అసంతృప్తులు ఎక్కువగా ఉండడంతో పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చరణ్‌ కౌసిక్‌ యాదవ్‌లతోపాటు మరికొందరు బుజ్జగింపు కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు.

Congress Ticket Issues in Mahabubnagar District : ఉమ్మడి పాలమూరులో అసంతృప్తి మంటలు.. కాంగ్రెస్‌కు పెద్ద సవాలే

జానారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమన్వయ కమిటీ, ఏఐసీసీ పంపిన ప్రత్యేక పరిశీలకులు టికెట్లు రావని ఆశావహులకు ముందే నచ్చచెప్పినట్లయితే... పెద్ద ఎత్తున ప్రభావం పడేది కాదన్న వాదన కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్థిత్వం ఖరారైన నేతలు.. అసంతృప్తుల వద్దకు వెళ్లి కలిసి మద్దతు కోరడంలో కూడా జాప్యం జరగడం ఇబ్బందులను తెచ్చి పెడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.

Ticket Clashes in Telangana Congress : కాంగ్రెస్​లో భగ్గుమంటున్న అసమ్మతి జ్వాలలు.. బరిలో నిలిచి తీరుతామంటున్న ఆశావహ నేతలు
Congress MLA Tickets Disputes in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతల పట్టు.. తేలని సీట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.