ETV Bharat / state

విష జ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: శ్రీధర్ బాబు - fairs

విష జ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్​ శాసనసభ్యుడు శ్రీధర్​ బాబు కోరారు. ఆరేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వేయకుండా విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారని అసెంబ్లీలో ఆయన ప్రశ్నించారు.

assembly
author img

By

Published : Sep 19, 2019, 5:51 PM IST

'డీఎస్సీ నోటిఫికేషన్​ ఎప్పుడు వేస్తారో చెప్పిండి'

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు. ఇప్పటికైనా డీఎస్సీ నోటిఫికేషన్​ ఎప్పుడు వేస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. అలాగే జూనియర్​ కళాశాలలో అధ్యాపకుల పోస్టులను కూడా భర్తీ చేయాలన్నారు. విష జ్వరాలను కూడా ఆరోగ్య శ్రీ పథకంలోకి చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్​ ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లు నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు.

ఇవీ చూడండి:రేవంత్​తో అలా మాట్లాడించింది ఉత్తమే!: జగదీశ్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.