రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కేవలం ఆస్తులు అమ్ముకోవడంపైనే కాకుండా.. ఆదాయ సృష్టి జరగాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. అప్పుల మీద ఆధారపడి.. ఎక్కువ రోజులు సంక్షేమ పథకాలను కొనసాగించలేమన్నారు.
వనరులను సృష్టించుకుని.. సంపదను పెంచుకుంటూ.. ప్రజానికాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం.. బడ్జెట్లో బీసీ వర్గాల మీద నిర్లక్ష్యం వహించిందన్నారు. 50 శాతం ఉన్న జనాభాకు.. కేవలం 2.39 శాతం కేటాయింపులు జరపడం అన్యాయమన్నారు. హామీల ప్రకారం.. నిరుద్యోగ భృతిని బడ్జెట్లో పెట్టకపోవడంపై ఆమె ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'ఐఓటీ'.. భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే టెక్నాలజీ