రాష్ట్ర కాంగ్రెస్‌కు సొంత పార్టీలోని కొందరి నేతలతోనే ఎక్కువ నష్టం జరుగుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని... ఇలాంటి సమయంలో అంతర్గత పోరు బాధాకరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు దిల్లీలో లాబీయింగ్‌లో హీరోలని... ఇది పార్టీకి శాపంగా మారిందని జగ్గారెడ్డి విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
ఇప్పటికైనా సోనియా గాంధీ జాగ్రత్తలు తీసుకుని పార్టీ బాగుపడేలా చూడాలని కోరారు. కాంగ్రెస్ హయాంలోనే జీవో 111ను ఎత్తివేయాలని కోరిందని తెలిపారు. 111జీవోను ఎత్తివేసి రైతులను ఆదుకోవాలని కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కోరుతున్నట్లు పేర్కొన్నారు.