ETV Bharat / state

Congress MLA Candidates List : తెలంగాణ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌.. బలమైన అభ్యర్థుల కోసం వేట.. - కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా

Congress MLA Candidates List : తెలంగాణ కాంగ్రెస్‌లో బలమైన అభ్యర్ధుల కోసం వేట కొనసాగుతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రంలోని పలు నియోజక వర్గాలల్లో ఇదే సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపు గుర్రాలే ప్రామాణికంగా ముందుకెళ్లుతుండడంతో ఇప్పటి వరకు తమకే టికెట్లు అనుకున్నస్థానాలల్లో చివర క్షణంలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Congress MLA Candidates List Telangana 2023
Congress MLA Candidates List
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 2:21 PM IST

Updated : Oct 9, 2023, 2:31 PM IST

Congress MLA Candidates List తెలంగాణ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌.. బలమైన అభ్యర్థుల కోసం వేట..

Congress MLA Candidates List Telangana 2023 : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌.. ఎన్నికల ప్రక్రియలో తొలిఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో రాజీపడని రీతిలో ముందుకు సాగుతోంది. పరిచయాలు, బంధుత్వాలు, డబ్బులు, కులాలు, మతాల్లాంటి వాటిని ఏ మాత్రం ప్రామాణికంగా తీసుకోకుండా.. గెలిచే సత్తా ఉన్న వారినే బరిలోకి దించేందుకు కసరత్తులు చేస్తోంది.

గులాబీ దళపతి వ్యూహాలకు ధీటుగా నిలబడి గెలువగల సత్తా ఉన్న వారినే టికెట్‌కు అర్హుడిగా భావిస్తోంది. పార్టీలోకి ఎప్పుడొచ్చామన్నది కాకుండా.. ప్రత్యర్థులను చిత్తు చేయగలిగే వారుంటే బీఫాం ఇవ్వాలని నిర్ణయించింది. సామాజిక అంశాలతోపాటు స్థానిక రాజకీయ పరిస్థితులు, సర్వేలు ఆధారం చేసుకుని పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతున్నట్లు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ వెల్లడించింది.

Telangana Congress MLA Candidates List Delay : ఈ వారం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా లేనట్టే..?

Competition For Telangana Congress Tickets : కాంగ్రెస్‌ నాయకత్వం పరిగణనలోకి తీసుకున్న ప్రమాణాల మేరకు రాష్ట్రంలో 15 చోట్లకు పైగా పార్టీకి ఇప్పటికీ బలమైన అభ్యర్థులు లేరని గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌ మహానగర పరిధిలోని 31 నియోజకవర్గాలల్లో చాలా చోట్ల ప్రత్యర్థులను చిత్తుచేయగలిగే వారు లేరని తేల్చినట్లు చర్చ జరుగుతోంది. ఇందుకోసం ఇతర పార్టీల నుంచి వచ్చే వారి కోసం పార్టీ నాయకత్వం వేచి చూస్తోంది. హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు కార్వాన్‌, గోషామహల్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, మలక్‌పేట్‌ ఉండగా.. అన్నిచోట్ల ఎమ్ఎమ్ఐ గెలిచే అవకాశం ఉంటుంది.

ఇతర పార్టీలకు ఇక్కడ అవకాశం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సారి మలక్‌పేట, గోషామహల్‌ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేయటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. సికింద్రాబాద్‌ నియోజకవర్గం తీసుకుంటే ముషీరాబాద్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి నియోజకవర్గాలు మినహాయిస్తే.. అంబర్‌పేట, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, సికింద్రబాద్‌ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఉన్నప్పటికీ గట్టి పోటీనిచ్చే వారు లేరని భావిస్తోంది. బయట పార్టీల నుంచి బలమైన నాయకులు వస్తే.. ప్రాథమికంగా ఎంపిక చేసిన వారి స్థానంలో మార్పులు ఉండే అవకాశం లేకపోలేదని సమాచారం.

Telangana Congress MLA Candidates List Delay : కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

Telangana Assembly Elections 2023 : మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో తీసుకుంటే కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ నియోజకవర్గాల్లో సరైన అభ్యర్ధులే లేరు. ఇక ఎల్బీ నగర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని ఢీకొట్టేందుకు ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ బలమైన నాయకుడిగా కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. కానీ, ఇక్కడ టికెట్‌ ఆశిస్తున్న మల్‌రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు.. మధుయాస్కీ టికెట్‌ ఇవ్వొద్దంటూ పట్టుబట్టారు. ఈ నియోజకవర్గంపై అధిష్ఠానం స్థాయిలో చర్చ జరుగుతోంది. మధుయాస్కీకి టికెట్‌ ఇస్తే ఆశావహులందరికీ పార్టీపరంగా న్యాయం చేస్తామని ఉన్నత స్థాయి నుంచి హామీఇచ్చే అవకాశాలున్నాయి.

ఇక చేవెళ్ల పార్లమెంటు పరిధిలో పరిగి, తాండూర్‌, వికారాబాద్‌ నియోజకవర్గాలల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్ధులుండగా.. మహేశ్వరంలో పారిజాత నర్సింహారెడ్డిని బరిలోదించాలని భావించారు. మరింత బలమైన నాయకుడు ఎవరైనా పార్టీలో చేరితో వారికే టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చే అభ్యర్ధులు లేనందున ఇతర పార్టీల నుంచి వచ్చే వారి కోసం వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తోంది.

అటు భువనగిరి పార్లమెంటు పరిధిలో తుంగతుర్తి, మునుగోడులో సరైన అభ్యర్థులు లేరని కాంగ్రెస్‌ నాయకత్వం అంచనా వేస్తోంది. మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమి పాలైన పాల్వాయి స్రవంతితో పాటు స్థానిక నేతలు చలమల కృష్ణారెడ్డి, కైలాస్‌ నేతలు టికెట్‌ ఆశిస్తున్నా.. వీరెవరికి టికెట్‌ ఇచ్చినా బీఆర్ఎస్, బీజేపీలను ఢీకొట్టే అవకాశం ఉండదనే భావన వ్యక్తమవుతోంది. ఇక్కడా ఎవరైనా బలమైన నాయకుడు చేరితో టికెట్ మార్పు ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా బలమైన అభ్యర్థులు లేని నియోజక వర్గాలను గుర్తించిన కాంగ్రెస్‌ నాయకత్వం.. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతల చేరికలు, ఆశావహులకు బుజ్జగింపులపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపిక కోసం సుదీర్ఘంగా కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకత్వం.. ఏదేమైనా గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది.

Telangana Congress Bus Yatra : బస్సుయాత్రపై 10న పీఏసీ తుది నిర్ణయం.. ఈనెల 15 నుంచే ప్రారంభం?

Congress Working Committee Meeting In New Delhi : ఐదు రాష్టాల ఎన్నికలు, కుల గణనపై CWC భేటీ.. అధికారం దక్కించుకునేలా వ్యూహాలు

Last Updated : Oct 9, 2023, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.